ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కనిపెట్టే కొత్త సాఫ్ట్‌వేర్.. దాని విశేషాలు ఇవే..

సాధారణంగా దగ్గు అనేది పెద్ద ప్రమాదకరమైన జబ్బు కాదు.కానీ అదేపనిగా దగ్గు వస్తూ ఉంటే అది ప్రాణాంతకమైన జబ్బుకి కారణం కావచ్చు.

 The New Software That Discovers The Health Of The Lungs These Are Its Features ,-TeluguStop.com

ఊపిరితిత్తుల పాడవడానికి కూడా ఇది సంకేతమని డాక్టర్లు చెపుతుంటారు.అయితే వైద్యుల వద్దకు వెళ్లి టెస్ట్ చేయించుకుంటే గానీ ఇది తెలుసుకోవడం సాధ్యం కాదు.

కాగా తాజాగా హైదరాబాద్‌కు చెందిన సాల్సిట్ టెక్నాలజీస్ సంస్థ దగ్గే దగ్గు సౌండ్ ఆధారంగా ఊపిరితిత్తుల ఆరోగ్యం కనిపెట్టే ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేసింది.ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది.

ఈ సాఫ్ట్‌వేర్‌తో ఓ యాప్ తీసుకురాగా అది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని చాలా తక్కువ సమయంలో అంచనా వేసి కచ్చితమైన వివరాలను అందిస్తుంది.దగ్గు సౌండ్ ఆధారంగా ఈ సాఫ్ట్‌వేర్ చాలా వివరాలను తెలియజేస్తుంది.

యాప్ ద్వారా మీరు దగ్గులో ఉన్న రకాలు, మీ దగ్గు ఏ రకమో అది ఎంత ప్రమాదకరమో తెలుసుకోవచ్చు.ఇందుకోసం యూజర్లు యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఫోన్ దగ్గర మూడు సార్లు దగ్గాలి.

ఈ సాఫ్ట్‌వేర్ నవంబర్ నెలలో ప్రతిష్ఠాత్మక అంజనీ మషేల్కర్ అవార్డును కూడా గెలిచింది.

Telugu Cough Lungs, Lungs, Software, Salcit-Latest News - Telugu

ఆరోగ్య కార్యకర్తలు, వైద్యుల కోసం మాత్రమే ఈ యాప్‌ను తయారు చేశారు కాబట్టి సామాన్యులు దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని వాడలేరు.ఆరోగ్య కార్యకర్తలు, వైద్య బృందాల కోసమే ఈ సాఫ్ట్‌వేర్ డెవలప్ చేశారని ఇప్పటికే కంపెనీ ఒక క్లారిటీ ఇచ్చింది.దీనికి యాక్సెస్ ఉన్నవారు ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేశాక పేషంట్ ప్రొఫైల్‌ క్రియేట్ చేసి, ఆపై యూజర్ల కోసం ఓ లింకు క్రియేట్ చేసి వారి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని టెస్ట్ చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube