Tirumala Tirupati Devasthanam : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. దర్శన టికెట్లు..

మన దేశం వ్యాప్తంగా చాలా మంది ప్రజలు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని పూజలు చేస్తూ ఉంటారు.ఇలా తిరుమలకు వెళ్లే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం.

 Good News For Srivari Devotees Darshan Tickets , Tirumala Tirupati Devasthanam-TeluguStop.com

శ్రీవారి దర్శనం తో పాటు స్వామివారికి అందించే సేవల టికెట్లను నేరుగా భక్తుల వద్దకే అందుబాటులోకి తెచ్చే విధంగా కొత్త ఆలోచనను ముందుకు తీసుకుని వస్తోంది.ఇప్పటివరకు ఈ శ్రీవారి దర్శన టికెట్లు ఆన్లైన్, ఆఫ్ లైన్ సేవల ద్వారా భక్తులకు టికెట్లను జారీ చేస్తున్నారు.

ఇక వసతి గృహాల మొదలుకొని శ్రీవారి వరకు అన్నిటిని ఒకే చోట అందుబాటులో ఉంచేలా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకోనుంది.

త్వరలో ఇలాంటి విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

టికెట్లు సేవలన్నీ ఒకే చోట అందుబాటులోకి తెస్తే ఇక శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు పండగే అని చెప్పవచ్చు.ప్రతి రోజు వేల నుంచి లక్షలాదిమంది భక్తులు వచ్చే తిరుమల కొండకు సంబంధించి పూర్తి సమాచారం అందుబాటులోకి తెచ్చేందుకు ఒక కొత్త యాప్ ను సిద్ధం కూడా చేస్తున్నారు.

టీటీడీ ఐటీ విభాగం దీనిని సిద్ధం చేసే అవకాశం ఉంది.తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు ఆ యాప్ లో ఉంచే అవకాశం ఉంది.

Telugu Bakti, Darshan Tickets, Devotional, Ttd-Latest News - Telugu

ఈ యాప్ రూపకల్పన దాదాపు పూర్తి అయిందని కొంతమంది ఐటీ అధికారులు చెబుతున్నారు.ప్రతిరోజు తిరుమలకు వచ్చేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల భక్తులు, విదేశాల నుంచి వచ్చేవారు కూడా ఉన్నారు.వీరికి ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ బుకింగ్ అవకాశము మాత్రమే అందుబాటులో ఉన్నాయి.ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి నిర్దేశించిన సమయం ప్రకారం కొండపైన వసతి గృహాలు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు.

అంతేకాకుండా ఈ కొత్త యాప్ ద్వారా శ్రీవారి సేవలు జరిగే సమయంలోనే సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube