విభజన జరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి పరంగా చూస్తే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా తెలంగాణకి హైదరాబాద్ ఉండటంతో… అభివృద్ధి పరంగా తెలంగాణ పేరు గట్టిగా వినిపిస్తుంది.
ఇలాంటి తరుణంలో విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు.రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున జాతీయ రహదారులు పడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంది.
ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా కొత్తగా మూడు విమాన సర్వీసులు ప్రారంభించాలని విమానాశ్రయాలు అభివృద్ధి సంస్థ లిమిటెడ్ నిర్ణయించింది.రీజినల్ కనెక్టివిటీ స్కీం కింద.కర్నూలు నుంచి విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం మధ్య కొత్త సర్వీసులను ప్రతిపాదించింది.ఇంక డిసెంబర్ 6వ తారీకు నుండి బెంగళూరు- విశాఖ మధ్య వారంలో రెండు రోజులు ఆకాశ ఎయిర్ లైన్స్ సంస్థ విమానాలు నడపనుంది.