US Recession : మెడపై ఆర్ధిక మాంద్యపు కత్తి.. అమెరికాలో బిక్కుబిక్కుమంటోన్న భారత సంతతి టెక్కీలు

కోవిడ్‌తో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైన సంగతి తెలిసిందే.తాజాగా ఆర్ధిక మాంద్యపు నీలినీడలు ప్రపంచవ్యాప్తంగా కమ్ముకుంటున్నాయి.

 Indian Origin Techies Working In The Us Worry About The Impending Recession,us,r-TeluguStop.com

దిగ్గజ సంస్థలైన మెటా, ట్విట్టర్‌, అమెజాన్, సేల్స్‌ఫోర్స్‌లలో అప్పుడే ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది.దీంతో కార్పోరేట్ రంగం.

ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో భయాందోళనలు నెలకొన్నాయి.ఈ పరిణామాలు అమెరికాలో హెచ్ 1 బీ వీసాతో పనిచేస్తున్న భారతీయులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి.
ఇప్పటికే ఉద్యోగులను తొలగించిన.లే ఆఫ్‌లను ప్రకటించిన సంస్థలలో పనిచేస్తున్న వారు భారతదేశంలో అవకాశాల కోసం చూస్తున్నట్లు కన్సల్టెంగ్ సంస్థలు చెబుతున్నాయి.కొందరు మరింత సుస్థిరమైన కంపెనీలలో ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు.తొలగింపులు వేగవంతం కావడంతో గత కొన్ని వారాల్లో కాల్‌ల పరిమాణం పెరిగిందని భారతీయ రిక్రూట్‌మెంట్ సంస్థలు జాతీయ మీడియా సంస్థకు తెలిపాయి.

అయితే భారతీయ జాబ్ మార్కెట్ కూడా ఏమంత గొప్పగా లేదు.కానీ ఇతర దేశాలతో పోలిస్తే ఇంకా ఆర్ధిక మాంద్యం ప్రభావం ఇండియాపై పడలేదు.

Antal India ఎండీ జోసెఫ్ దేవాసియా మాట్లాడుతూ.గత వారం ట్విట్టర్, స్ట్రిప్, సేల్స్‌ఫోర్స్, అమెజాన్, లిఫ్ట్ తదితర సంస్థల్లో పనిచేసిన వారు తనను సంప్రదించారని తెలిపారు.

అట్రిషన్ ఎక్కువగా వున్న ఐటీ సర్వీసుల్లోని వారితో సహా భారతీయ కంపెనీలు ఇప్పటికీ నియామకాలు కొనసాగిస్తున్నాయని జోసెఫ్ వెల్లడించారు.ఇక్కడ ప్రొడక్ట్ మేనేజర్ల కొరత వేధిస్తోందని ఆయన వెల్లడించారు.

ఐటీ, నాన్ ఐటీ రంగాల్లో మంచి టెక్ టాలెంట్ కోసం ఇప్పటికీ డిమాండ్ వుందన్నారు.

Telugu Amazon, India, Btiexecutive, James Agarwal, Layoffs, Meta, Salesce-Telugu

BTI Executive Search ఎండీ జేమ్స్ అగర్వాల్ మాట్లాడుతూ.చాలా మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఇప్పుడు తమకు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ , పెద్ద టీమ్‌లతో ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ పాత్రలు అవసరం లేదని చెబుతున్నారని తెలిపారు.భారత సంతతికి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, పలువురు యూఎస్ పౌరులు కూడా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ కంపెనీల వైపు ఎక్కువగా చూస్తున్నారని అగర్వాల్ పేర్కొన్నారు.

మొత్తం మీద విదేశాల్లో పని చేయాలనుకుంటున్న అనేకమంది భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు ప్రస్తుత వాతావరణాన్ని దృష్టిలో వుంచుకుని తమ మనసు మార్చుకుంటున్నారు.దీనికి సంబంధించి ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ కేసును అగర్వాల్ ఒక ఉదాహరణగా తెలిపారు.

అతను తొలుత అమెరికాలో ఉద్యోగం కోసం పట్టుబట్టాడని.కానీ ఇప్పుడు చెన్నైలో CXO జాబ్‌లో చేరినట్లు చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube