Car Drags Bike: మరి అంత బలుపుతో కార్ నడపకూడదు భయ్యా.. వీడియో వైరల్..

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు అతివేగం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి.ఆ ప్రమాదాలలో చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు.

 Car Drags Bike For Kilometer In Uttarpradesh Deails, Car Drags Bike, Uttarprade-TeluguStop.com

మద్యం సేవించడం, అతివేగం వల్ల వారి ప్రాణాలకి ప్రమాదం కాకుండా రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులకు కూడా ప్రమాదం కలగవచ్చు.అందుకోసం ఒక ఐదు నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు కానీ గమ్యానికి కచ్చితంగా చేరుకోవడమే ముఖ్యం అనే విషయం మాత్రం మర్చిపోకూడదు.

కానీ ఈ వీడియోలో అతివేగంతో ఒక కారు డ్రైవర్ రెచ్చిపోయి కారుని నడిపాడు.నా కారుకు అడ్డు వస్తే ఎవరినైనా ఢీ కొడతాను అన్నట్లుగా ఆ కారు ని నడిపాడు.

ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ కు చెందిన ఒక కారు డ్రైవర్ ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేశాడు.తనకు ఇష్టం వచ్చిన అంత వేగంగా కారు నడుపుతూ అడ్డు వచ్చినా రెండు బైకులను ఢీకొట్టాడు.

ఆ తరువాత కింద పడిపోయిన ఒక బైకును తన కారు ముందు భాగమైన బంపర్ కింద పెట్టుకుని కిలోమీటర్ దూరం వరకు కారు ను అలాగే నడిపాడు.ఈ క్రమంలో బైక్ ను రోడ్డుపై ఈర్చుకుంటూ వెళ్తుండగా రోడ్డు మీద మంటలతో కూడిన మెరుపులు కూడా వచ్చాయి.

ఈ విషయాన్ని గమనించిన కొంతమంది బైక్ పై వెళుతున్న యువకులు వీడియో తీశారు.

వారిని చూసినా కారు డ్రైవర్ మరింత వేగం పెంచి కారు నడిపాడు.

ఒకచోట కారుని ఆపిన బైక్ పై వెళ్తున్న యువకులు డ్రైవర్ ను కిందికి దిగాలని చెప్పినప్పటికీ అతను దిగకుండా కారును వేగంగా నడుపుకుంటూ వెళ్లిపోయాడు.ఈ ఘటనపై ఇందిరాపురం పరిధిలోని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్‌ చేసినట్టు సమాచారం.ఈ ప్రమాదంలో బైకర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోను చూసినా నెటిజెన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.ఏంది భయ్యా ఇంత బలుపు అని కొంతమంది, ఫుల్లుగా తాగి కారు నడుపుతున్నావా అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube