టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు, ప్రస్తుత బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా బద్ద రాజకీయ ప్రత్యర్థులు.వారిద్దరూ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే పోటీ మొదలైంది.2010లో వీరి మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది.కన్నా లక్ష్మీనారాయణపై రాయపాటి సాంబశివరావు అవినీతి ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలపై కన్నా తీవ్రంగా స్పందించి రాయపాటిపై కోటి రూపాయల పరువు నష్టం దావా వేశారు.చాలా రోజులు 4వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఈ కేసు విచారణ కూడా జరిగింది.
కన్నాపై చేసిన ఆరోపణలను రాయపాటి ఉపసంహరించుకోగా, పరువు నష్టం కేసును కన్నా ఉపసంహరించుకోవడంతో దశాబ్దాల నాటి పోరుకు తెరపడింది.అయితే రాజీ వెనుక ఎవరున్నారన్నది మరో పెద్ద ప్రశ్న!
రాయపాటి ఇప్పుడు ప్రతిపక్ష టీడీపీలో ఉండగా, కన్నా బీజేపీలో ఉన్నారు.కొంతకాలం క్రితం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కూడా పని చేశారు.2024 సార్వత్రిక ఎన్నికలకు కన్నా టీడీపీలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందకు గాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కన్నాకు మార్గం సుగమం చేశారని తెలుస్తుంది.జగన్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఏ అవకాశాన్ని కూడా చంద్రభాబు వదిలిపెట్టడం లేదు.
YSRCPని ఓడించడానికి ఓట్లు విభజన జరగకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం రాయపాటి కూడా టీడీపీలోనే ఉన్నారు.ఒక్కవేళ కన్నా టీడీపీలోకి వస్తే వీరిద్దరి మధ్య సఖ్యత ఎలా ఉంటుందో అని శ్రేణిలు భావిస్తున్నాయి.ఒక్కవేళ వీరిద్దరూ కలిసి పని చేస్తే గుంటురూ జిల్లాలో టీడీపీ ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది.
కన్నానే కాకుండా మరికిందరూ నేతలు కూడా టీడీపీలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారు.త్వరలో టీడీపీలోకి భారీ చేరికలు ఉంటాయని టీడీపీ నేతలు అంటున్నారు.