కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా మారియా ర్యాబోషప్క హీరోయిన్ గా జాతి రత్నాలు డైరెక్టర్ కెవి అనుదీప్ దర్శకత్వంలో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర స్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నిర్మించిన చిత్రం ప్రిన్స్.
ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయిందని చెప్పాలి.ఇలా అక్టోబర్ 21వ తేదీ థియేటర్లో విడుదలైన ఈ సినిమా త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.
థియేటర్లో విడుదలైన ప్రతి ఒక్క సినిమా కూడా డిజిటల్ మీడియాలో ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రిన్స్ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాని నవంబర్ 25వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం చేయనున్నట్టు వెల్లడించారు.

25వ తేదీ నుంచి ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో అందుబాటులోకి రానుంది.రేమో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ కార్తికేయన్ అనంతరం పలు సినిమాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు.ఈ క్రమంలోనే ఈయన ప్రిన్స్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయిందని చెప్పాలి.థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా డిజిటల్ మీడియాలో అయినా ప్రేక్షకులను సందడి చేస్తుందో లేదో చూడాలి.







