రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు భారీ ఎదురుదెబ్బ.. అందుకు అనుమతి రద్దు!

రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.శనివారం కేంద్ర ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది.

 A Huge Setback For The Rajiv Gandhi Foundation , Rajiv Gandhi Foundation, Sonia-TeluguStop.com

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ) అనుమతిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.అయితే విదేశీ నిధుల చట్టాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అనేది గాంధీ కుటుంబం నిర్వహిస్తున్న ప్రభుత్వేతర సంస్థ.అయితే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ నిర్వహణపై పలు ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో దర్యాప్తు చేసేందుకు కేంద్ర హోం శాఖ 2020 జులైలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఎఫ్‌సీఆర్ఏ అనుమతిని రద్దు చేసినట్లు సమాచారం.

ఈ సమాచారాన్ని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆఫీస్ బేరర్లకు తెలియజేశారు.కాగా, 1991లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఏర్పడింది.

ఈ ఫౌండేషన్‌కు చైర్ పర్సన్‌గా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యవహరిస్తున్నారు.అలాగే మాజీ ప్రధాని మనోహ్మన్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి పీ.చిదంబరం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ట్రస్టీలుగా కొనసాగుతున్నారు.రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.2009 వరకు ఈ ట్రస్ట్ విద్య, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలను అభివృద్ధి చేసింది.అలాగే బాలలు, మహిళలు, వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేశారు.

Telugu Permits, National Agency, Priyanka Gandhi, Rahul Gandhi, Rajiv Gandhi, So

తెలంగాణలో ప్రవేశించిన భారత్ జోడో యాత్ర.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తెలంగాణలో ప్రవేశించింది.కర్ణాటకలోని రాయచూర్ నుంచి రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా గూడబల్లూరు సమీపంలోని కృష్ణ చెక్ పోస్టు వద్ద ప్రవేశించింది.అక్కడే రాహుల్ గాంధీ తెలంగాణలో మొదటిసారిగా అడుగుపెట్టారు.తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఆయనను ఘనంగా స్వాగతం పలికారు.ఈ క్రమంలో మారుతినగర్ వద్ద కృష్ణా వంతెన వద్ద భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ తదితరులు రాహుల్ గాంధీ వెంబడి ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube