కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది.తన సోదరుడైన బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి మునుగోడులో బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలంటూ వెంకట్ రెడ్డి ఆడియో వైరల్ గా మారింది.దీనిపై క్రమశిక్షణ కమిటీకి మాణిక్కం ఠాగూర్ ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు ఆడియో లీక్ పై ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ వెంకట్ రెడ్డిని పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది.