డిప్రెషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన దేత్తడి హారిక.. స్టోరీ వైరల్!

సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రతి ఒక్కరు సెలెబ్రిటీలు అవుతున్నారు.ఇప్పటికే ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు కాగా సినిమాలలో కూడా అడుగులు పెడుతున్నారు.

 Dettadi Harika Made Shocking Comments About Depression Story Goes Viral ,dettadi-TeluguStop.com

ఇక మరో సోషల్ మీడియా యూజర్ దేత్తడి హారిక కూడా సెలబ్రిటీ హోదాను అందుకున్న సంగతి తెలిసిందే.యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు చేస్తూ సెలబ్రిటీగా మారింది.

అంతేకాకుండా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

యూట్యూబ్ లో ఓ ఛానల్ ను క్రియేట్ చేసుకొని అందులో ఎన్నో వీడియోలు చేస్తూ యువతని బాగా ఆకట్టుకుంది.

అంతే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంది.ఇక ఈ గుర్తింపుతోనే బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో అడుగు పెట్టి మరింత పరిచయాన్ని పెంచుకుంది.

ఇక ఇందులో ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.టైటిల్ విన్నర్ అభిజిత్ తో బాగా క్లోజ్ అయింది.

ఇక బిగ్ బాస్ తోనే మరింత సెలబ్రిటీ హోదాను అందుకొని ఫాలోయింగ్ కూడా పెంచుకుంది.అందులో పాల్గొన్న మరో కంటెస్టెంట్ లతో కలిసి బయట బాగా సందడి చేస్తుంది.

అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా అవకాశం అందుకొని మంచి సక్సెస్ అందుకుంది.మళ్లీ యూట్యూబ్ ద్వారా తన వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ మరింత హాట్ నెస్ ను పరిచయం చేస్తుంది హారిక.

Telugu Abhijith, Dettadi Harika-Movie

కానీ వెండితెరపై అంతగా మాత్రం అవకాశాలు అందుకోవటం లేదు.కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తుంది.అంతేకాకుండా చిన్న చిన్న అడ్వటైజ్మెంట్లలో కూడా కనిపిస్తుంది.

నిజానికి హారికకు బిగ్బాస్ కు రాకముందు మంచి క్రేజ్ ఉండేది.అప్పట్లో తను చేసే వీడియోలు బాగా హైలైట్ అయ్యాయి.

ప్రతి ఒక్క వీడియో మంచి లైక్స్ ను పొందేవి.

కానీ ఇప్పుడు మాత్రం హారిక వెనుక పడిపోయింది అని చెప్పొచ్చు.

తన వీడియోలు కూడా అంతగా కనెక్ట్ అవ్వడం లేదు.ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇప్పటికే చాలామంది స్టార్స్ పరిచయం కావడంతో హారికను ఎవరు పట్టించుకోవటం లేదు.

ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం పోస్టులు షేర్ చేస్తూ బాగా టచ్ లో ఉంటుంది.

Telugu Abhijith, Dettadi Harika-Movie

ఇదంతా పక్కన పెడితే తాజాగా.తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది హారిక.అయితే అందులో ఓ నెటిజన్.

మీ జీవితంలో మీరు మీ డిప్రెషన్ ను ఎలా జయించగలిగారు అని అడగగా.దాంతో హారిక తనకు డిప్రెషన్ అనేది లేదని.

నాకు తెలియకుండానే నా జీవితం కొనసాగుతుంది అంటూ.అలా అని నాకు డిప్రెషన్ వస్తే ఎక్కడ ఆగిపోను.

ఏదో ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్తాను అని తెలిపింది.ఇక మరో నెటిజెన్ మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు అని అడగటంతో.

తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక మాట పెళ్లి అని షాకింగ్ కామెంట్ చేసింది హారిక.ఇక ప్రస్తుతం ఆమె స్టోరీ బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube