మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.600 పేజీల చార్జి షీట్ ను రాచకొండ పోలీసులు దాఖలు చేశారు.సీసీ ఫుటేజ్, డీఎన్ఏ రిపోర్ట్, వెపన్ దుర్వినియోగం వివరాలతో పాటు బాధితురాలు స్టేట్ మెంట్ ను పోలీసులు చార్జి షీట్లో పొందుపరిచారు.కిడ్నాప్ మరియు అత్యాచారయత్నం కేసులో నాగేశ్వరరావు అరెస్టయిన సంగతి తెలిసిందే.
దాదాపు రెండు నెలల పాటు నాగేశ్వరరావు జైల్లో ఉన్నారు.ఇటీవల బెయిల్ పై విడుదలైన మాజీ సీఐ నాగేశ్వరరావును రెండు రోజుల క్రితం సర్వీస్ నుంచి తొలగించారు అధికారులు.