మనం తరచూ ప్రమాదవశాత్తు జరిగే కొన్ని ఘటనలను చూస్తూ ఉంటాం.అలా కొన్ని ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరుగుతుంది.
అలాగే అదృష్టం ఉంటే ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయట పడతారు.అలా తాజాగా బ్రెజిల్ లో ఓ ప్రమాదం లో అదృష్టవశాత్తు కొంత మంది ప్రాణాలతో బయటపడ్డారు.
ఒక హెలికాప్టర్ టేకాఫ్ అవుతూ హై టెన్షన్ కరెంట్ వైర్లకు తగిలింది.అయితే అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న వారందరూ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల్లోకి వెళ్తే ఈ హెలికాప్టర్ ప్రమాదం బ్రెజిల్ లోని మినాస్ గెరైస్ రాష్ట్రంలో జరిగింది.
బ్రెజిల్‌కు చెందిన పార్లమెంట్ సభ్యులు ఇతర ప్రజా ప్రతినిధులుతో కూడిన హెలికాప్టర్ మినాస్ గెరైస్ రాష్ట్రంలో టేకాఫ్ అవుతుండగా అక్కడున్న విద్యుత్ తీగలకు తగిలి ఆ హెలికాప్టర్ కింద పడిపోయింది.మంటలు చెలరేగకముందే అందులో ఉండే వారు ఫైలెట్ తో సహా ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
దీంతో ప్రయాణికులతో పాటు పైలట్ కి చిన్న చిన్న గాయాలతో ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు.ఇది చూసిన స్థానికులు రెస్క్యూ టీం ను పిలువగా వెంటనే రెస్క్యూ టీం స్పందించి అక్కడికి చేరుకుంది.
అక్కడకు చేరుకుని మంటలను అదుపు లోకి తెచ్చింది.
అంతేకాకుండా ప్రజాప్రతినిధులందరినీ స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ లు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు చిన్న చిన్న గాయాలు అయ్యాయని స్పష్టం చేశారు.వాళ్ళకి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు.
ఇదిలా ఉండగా హెలికాఫ్టర్‌పై ఫైలెట్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు.అంతేకాకుండా దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నారు.
ఇది ఎలా జరిగిందన్నది త్వరలోనే కనిపెడతాము అని పోలీసు బృందం వెల్లడించింది.అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఈ ఘటనను చూసి వీడియో తీయగా ఈ ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.