వైరల్: ఈ కుక్క ఎంజాయ్‌ చేసినట్టు మీరు చేయగలరా? ఒక్కసారి చూడండి, కష్టాలన్నీ మర్చిపోతారు!

సోషల్ మీడియా ఇపుడు ప్రపంచాన్ని శాసిస్తోంది.జనాలు ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నారో తెలుసా, నెట్టింట్లో కాపురాలు చేస్తున్నారు.

 Viral: Can You Do What This Dog Enjoys One Look And You Will Forget All Your Tro-TeluguStop.com

ఈ కారణంగానే నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి.వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని.

ఇంకొన్ని ఆశ్చర్యకరంగా, మరికొన్ని కాస్త జుగుప్సాకరంగా ఉంటాయి.కాగా.

వైరల్‌ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉండటం విశేషం.తాజాగా.

ఓ కుక్కకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఒక పెంపుడు కుక్క ఎండిన ఆకుల కుప్పలోకి ఆనందంగా దూకుతూ చాలా బాగా ఎంజాయ్‌ చేస్తోంది.

ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.వాళ్ళవాళ్ళ బాల్యంలోకి వెళ్లి వచ్చినట్టు ఉందని చెబుతున్నారు.సాధారణంగా కుక్కలను విశ్వాసానికి ప్రతీకగా పేర్కొంటారు.వీటిని చాలామంది ఇష్టంతో పెంచుకుంటారు.ఇవి యాజమాని ప్రాణాపాయంలో ఉంటే.అవసరమైతే ప్రాణాలకు తెగించి మరీ కాపాడతాయి.

అందుకే.చాలామంది శునకాలను పెంచుకుంటారు.

ఇకపోతే ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో డాగ్స్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌ షేర్‌ చేసింది.ఈ కుక్క పేరు స్టెల్లా అని పోస్టులో పేర్కొంది.వీడియో ఒకసారి చూస్తే, తలుపు తీయగానే స్టెల్లా ఇంటి లోపల మెట్ల మీద నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి బయట ఉన్న ఆకుల కుప్పపైకి దూకుతుంది.ఆకుల కుప్పలోకి దూకిన తర్వాత స్టెల్లా ఆనందంతో ఇతరులకు కనిపించకుండా దాక్కుంటుంది.ఈ వీడియోను షేర్ చేసినప్పటి నుంచి 6.4 లక్షలకు పైగా వీక్షించగా.33,000 మంది లైక్‌ చేశారు.కుక్క.

చిన్న పిల్లాడి మాదిరిగా మస్తుగా ఎంజాయ్‌ చేస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube