జీవితంలో చాలామంది సక్సెస్ కావాలని రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తుంటారు.కానీ కొందరు మాత్రం ఎంత కష్టపడి పని చేసినా ఎప్పుడు సక్సెస్ కాలేకపోతుంటారు.
జీవితంలో కష్టపడిన ప్రతి ఒక్కరూ సక్సెస్ కాలేరు, ఎందుకంటే జీవితంలో సక్సెస్ కావాల అంటే ఎన్నో ఒడిదుడుకులను ఎదురుకోవాల్సి వస్తుంది.ఒక టార్గెట్ పెట్టుకొని దానికి తగ్గట్టు మనం కష్టపడితే కచ్చితంగా సక్సెస్ అవుతారు.
ఇలా ఎన్నో కష్టాలు పడి కూడా సక్సెస్ కాలేకపోతున్న వారికి ఈ 19 సంవత్సరముల కుర్రాడి జీవితం ఆదర్శంగా తీసుకోవాలి.ఎందుకంటే 19 సంవత్సరాల వయసు లోనే 1000 కోట్లు సంపాదించాడు.
ఇంతకీ ఈ కుర్రోడు ఏం చేసి ఇంత డబ్బు సంపాదించాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.19 ఏళ్ల వయసులోనే కోట్లు సంపాదిస్తున్న వ్యక్తుల జాబితాలో కైవల్య వోహ్రా నిలిచాడు.కైవల్య వోహ్రా క్విక్ గ్రోసరీ డెలివరీ ఆప్ జిప్టో సహవ్యవస్థాపకుడు.పాలిచా అనే మరో కుర్రాడు కూడా ఆదర్శమే.ఈ కుర్రాడి వయసు 20 సంవత్సరాలు.వీళ్లిద్దరు స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీ లో చదువుకున్నారు.
అయితే వీళ్లిద్దరు కలిసి జిప్టో మొదలుపెట్టారు.వీరిద్దరూ కోట్లు సంపాదిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
వోహ్రా రూ.1000 కోట్లతో ధనవంతుల లిస్ట్ లో 1,036వ స్థానంలో ఉండగా పలిచా రూ.1,200 కోట్లతో 950వ స్థానంలో వున్నాడు.ముంబై కి చెందిన ఈ కంపెనీ ఇప్పుడు పది నగరాల్లో 1000 మందికి పైగా ఉద్యోగులతో ముందుకు వెళ్తోంది.
ఈ కంపెనీ 3000కు పైగా కిరాణా వగైరా సామాన్లను డెలివరీ చేస్తోంది.చాలా మంది ఏదో చేయాలని చేయలేకపోతు పైగా బద్ధకంతో ఆగిపోవడం, మంచి సమయం కోసం ఎదురు చూడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు.
అలానే ఒక గోల్ సెట్ చేసుకుని ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తే సక్సెస్ కావచ్చు.