తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రజా సమస్యలను పట్టించుకోని ఏకైక సీఎం కేసీఆరేనని మండిపడ్డారు.
లిక్కర్ సహా అన్ని స్కాముల్లోనూ కేసీఆర్ కుటుంబమే ఉందని ఆరోపించారు.ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా చేయాలని సీఎం మహా కుట్రకు తెరతీశారని విమర్శించారు.
బీజేపీపై నెపం నెట్టి సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తేవాలని టీఆర్ఎస్ భావిస్తోందన్నారు.ద్రౌపది ముర్మును ఓడించాలని కృషి చేసిన సీఎం కేసీఆర్.
ఎస్టీల గురించి మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యనించారు.అనంతరం దమ్ముంటే ఎస్టీ రిజర్వేషన్ల అమలుపై ప్రమాణం చేసేందుకు రావాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.