వీడియో: కుక్కకి, సీల్‌కి మధ్య నీటిలో పోటీ.. చివరికి ఏది గెలిచిందంటే!

సోషల్ మీడియాలో వైరలయ్యే యానిమల్ వీడియోలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.ముఖ్యంగా డాగ్ వీడియోలు ఎప్పుడూ నెటిజన్లను ఆకర్షిస్తూనే ఉంటాయి.

 Video A Dog And A Seal Compete In The Water Which One Wins In The End, Dog , Vi-TeluguStop.com

ఇవి చేసే స్మార్ట్ పనులు అందర్నీ అబ్బురపరుస్తాయి.అయితే యజమానులు ఒక్కోసారి వీటితో ఎవరూ ఊహించని రీతిలో పనులు చేయిస్తుంటారు.

వాటిని గాల్లో ఎగిరేలా ఛాలెంజ్‌లు పెడతారు.అయితే తాజాగా ఒక యజమాని తన కుక్కతో ఫెచ్ ఆట ఆడించాడు.

ఫెచ్ ఆట అంటే ఏదైనా బొమ్మను లేదా బంతిని విసిరేస్తే కుక్క వెళ్లి దానిని పట్టుకొని తిరిగి యజమాని దగ్గరికి తీసుకొస్తుంది.

కాగా తాజాగా ఒక యజమాని ఒక బంతిని నీటిలో పారేసి తన కుక్కను తెమ్మన్నాడు.

అదే నీటిలో ఒక సీల్ కూడా ఉంది.అది కూడా బంతిని నోట కరుచుకునేందుకు సిద్ధమైంది.

దీంతో ఆ బంతిని ఎవరు ముందు పట్టుకుంటారనేది ఒక పోటీ లాగా మారింది.ప్రముఖ ట్విట్టర్‌ హ్యాండిల్ బ్యూటెంగేబిడెన్ (@Buitengebieden) షేర్ చేసిన ఈ వీడియోకి 10 లక్షలకు పైగా వ్యూస్, 29 వేల లైక్స్ వచ్చాయి.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే.ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి బీచ్‌లో ఆడుకుంటున్నట్లు చూడవచ్చు.కొన్ని సెకన్ల తర్వాత ఆ వ్యక్తి కుక్కతో ఫెచ్ గేమ్‌ ప్లే చేయాలని అనుకున్నాడు.దానికి సముద్ర నీటిని సెలెక్ట్ చేసుకున్నాడు.సముద్రంలో అతడు బంతిని విసిరేస్తే ఆ కుక్క తీసుకురావాలన్న మాట.అయితే ఆ నీటిలో మరొక పోటీదారుగా సముద్ర క్షీరదం సీల్ కూడా ఉంది.అది కూడా అతను విసిరేసే బంతిని క్యాచ్ పట్టడానికి సిద్ధమైంది.ఆ విధంగా అతను బంతిని విసిరి వేయగానే ఒక వైపు కుక్క మరో వైపు సీలు దాని వైపు వేగంగా దూసుకెళ్లాయి.

అయితే నీటిని లెక్కచేయకుండా అందులో వేగంగా ఈదుతూ కుక్క మొదటగా దాని వద్దకు చేరుకుంటుంది.ఆ తర్వాత బంతిని నోట్లో పెట్టుకొని బయటికి తీసుకు వచ్చి అది విజయం సాధిస్తుంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు కుక్కను తెగ పొగుడుతున్నారు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube