టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో సహాయ నటుడి పాత్రలలో నటించి అనంతరం హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు శర్వానంద్ ఒకరు.అయితే ఈయన వరుస సినిమాలో చేస్తున్నప్పటికీ ఈయనకు సరైన హిట్టు పడి చాలా కాలం అయింది.
ఇక ఈయన సినిమాలన్నీ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంటున్నాప్పటికీ వరుస సినిమా అవకాశాలను అందుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఈ క్రమంలోనే శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం త్వరలోనే విడుదల కానుంది.
ఇక ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.నూతన దర్శకుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్ రీతు వర్మ జంటగా నటించారు.
ఇక ఈ సినిమాలో సీనియర్ నటి అమల శర్వానంద్ మదర్ పాత్రలో నటిస్తూ సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఈ చిత్రంతో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తెలుగులో అడుగుపెడుతోంది.
తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా హీరో శర్వానంద్ మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ఒకే ఒక జీవితం మనసుని హత్తుకునే సినిమా ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాలో ఉండే ప్రతి ఒక్క పాత్రకి కనెక్ట్ అవుతాము.ఈ సినిమాలో నిన్నటిబాధ రేపటి ఆశతో బ్రతుకుతాం కానీ ఈ క్షణాన్ని గుర్తించము.దానిని గుర్తించినప్పుడు లైఫ్ ప్లీజ్ బ్యూటిఫుల్ అనే ఒక గొప్ప విషయాన్ని డైరెక్టర్ కార్తీక్ ఎంతో అద్భుతంగా చూపించారు.ఇలా జీవితం గురించి ఎన్నో మంచి విషయాలను ఈ సినిమాలో చూపించడంతో ఈ సినిమాకి ఒకే ఒక జీవితం అనే టైటిల్ పెట్టామని, ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరిస్తుంది అంటూ ఈ సందర్భంగా శర్వానంద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.