పవన్ కళ్యాణ్ పై మంత్రి దాడిశెట్టి రాజా సీరియస్ కామెంట్స్..!!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం తెలిసిందే.ఈ సమావేశంలో ఏపీలో ప్రస్తుత రాజకీయాలపై తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

 Minister Dadishetty Raja's Serious Comments On Pawan Kalyan Minister Dadishetty-TeluguStop.com

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ నుండి విముక్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు అందుకోసం ఎవరితోనైనా కలిసి పని చేస్తానని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో అమరావతి ఏపీకి ఏకైక రాజధానిగా ఉండాలని తెలిపారు.

భారీ వ్యూహాలతో రానున్న రోజుల్లో జనసేన పార్టీని ముందుకు తీసుకెళుతున్నట్లు చెప్పుకొచ్చారు.ఇటువంటి తరుణంలో పవన్ వ్యాఖ్యలపై మంత్రి దాడిశెట్టి రాజా తనదైన శైలిలో కౌంటర్లు వేశారు.

పవన్ కళ్యాణ్ కి డీల్ కుదిరింది… ప్యాకేజీ సెట్ అయ్యింది.జనసేన కాదు అది నారా- నాదెండ్ల సేనరాజకీయమంటే సొంత కళ్యాణం కాదు… లోక కళ్యాణం.

ఇటువంటి పవన్ కళ్యాణ్ కి మంగళగిరిలో పార్టీ ఆఫీస్ ఎందుకు తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉంది కదా అంటూ తనదైన శైలిలో పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి దాడిశెట్టి రాజా కౌంటర్లు వేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube