జీఎస్టీ వల్ల ఎన్నో లాభాలు..

పార్లమెంట్ లో జీఎస్టీపై రచ్చ జరుగుతోంది.రోజూ వాడే కొన్ని వస్తువులపై జీఎస్టీ పెంచడాన్ని తప్పుపడుతూ విపక్షాలు నిరసన తెలిపాయి.

 New Gst Rates On Daily Essential Goods Facts,gst,gst Rates, Central Goernment, G-TeluguStop.com

కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, లెఫ్ట్ పార్టీలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి.అయితే, జీఎస్టీ వల్ల లాభాలే కాని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని, ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

అత్యధిక వస్తువులకు పన్నుల నుంచి ఉపశమనం లభించింది.

జీఎస్టీ రేట్లపై మరో సారి కేంద్రం కొత్త సవరణలు చేపట్టింది.

కొన్ని ఉత్పత్తులు, సేవలపై నూతన జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నట్లు కేంద్రం ప్రకటించింది.దీనివల్ల కొన్నింటి ధరలు బాగా పెరిగగా మరి కొన్ని ఉత్పత్తుల ధరలు ఓ మోస్తరుగా తగ్గాయి.

గత నెలలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు రేట్లలో మార్పులు చోటుచేసుకున్నట్లు అధికారిక సమాచారం.

పెరుగు, బ్లేడ్, పన్నీర్ వంటి నిత్యావసరాలపై జీఎస్టీ పెంచడంపై విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

అయితే వీటిలో ప్యాకింగ్ చేసిన లేబుల్ ఉన్న సరుకులే జీఎస్టీ ఉంటుందని కేంద్రం తెలిపింది.లూజ్ గా అమ్మే వాటిపై జీఎస్టీ ఉండదని స్పష్టం చేసింది.అసలు జీఎస్టీని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలను ఆర్థిక నిపుణులు తప్పుపడుతున్నారు.జీఎస్టీ వచ్చిన తరువాత అత్యధిక వస్తువులకు పన్నుల నుంచి ఉపశమనం లభించింది.

Telugu Central, Gst, Gst Rates, Gstrates-Political

జీఎస్టీ వల్ల పేదలకు, సాధారణ ప్రజలకు, చిన్న తరహావ్యాపారులకూ లాభం చేకూరుతుందని నిపుణులుచెబుతున్నారు.అనేక వస్తువుల ధరలు తగ్గాయన్నారు. పన్నుల చెల్లింపు, రిజిస్ట్రేషన్, రిటర్న్ దాఖలు, పన్నుల రిఫండ్ ప్రక్రియలు సులభతరమయ్యాయి.పన్నులు స్థిరంగా ఉండటం వల్ల అంతర్జాతీయంగా మన ఉత్పత్తుల ఎగుమతులు పెరుగాయపి నిపుణులు చెబుతున్నారు.

మినహాయింపులు కూర్పుల విధానం వల్ల చిన్నతరహా సప్లయర్ల ఉత్పత్తుల ధరలు తగ్గాయి.వస్తువులు, సేవలు స్వేచ్ఛకల్పించడం ద్వారా ఏర్పడే పోటీ వల్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది.దేశంలో ఒకే ఒక ఆర్థిక వ్యవస్థ ఏర్పడి జాతీయత. ఐక్యత భావన ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

జీఎస్టీ వల్ల పన్నుల ఎగవేత దారుల ఆటలు సాగవంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube