తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండర్

1.భారతీయులకు ఇండియన్ ఎంపీసీ కీలక సూచన

 

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, America, Immigran-TeluguStop.com
Telugu America, Atlanta, Canada, Cia Putins, Kuwait, Nri, Nri Telugu, Oman, Qata

శ్రీలంకలోని కొలంబో సమీపంలో గత రాత్రి జరిగిన దాడిలో భారత ప్రభుత్వ అధికారి గాయపడ్డారు.ఈ విషయాన్ని శ్రీలంకలోని భారత రాయబారి కార్యాలయం తెలిపింది.దీనిపై శ్రీలంక లోని భారతీయులకు కీలక సూచనలు చేసింది.

దాడిలో గాయపడిన ఇండియన్ వీసా సెంటర్ డైరెక్టర్ వివేక్ వర్మ ను పరామర్శించినట్లు తెలిపింది.అంతేకాకుండా శ్రీలంకలోని భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని పౌరులకు సూచించింది.
 

2.సౌదీలో గిరిజనుడు మృతి .కుటుంబానికి అండగా నిలిచిన ప్రవాశీయులు

 మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలంలోని మండల గిరిజన తండాకు చెందిన నారియా నాయక్ అనే గిరిజనుడు సౌదీ అరేబియాలోని నాయిల్ అనే ప్రాంతంలో ప్రైవేట్ పని చేస్తూ అనారోగ్యానికి గురై  మరణించడంతో గిరిజనులందరూ కలిసి విరాళాలు సేకరించి ఆసుపత్రి బిల్లు చెల్లించారు.ఈ విషయం తెలుసుకున్న సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ ( సాబా ) అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన చిత్తలూరి రంజిత్ ఆధ్వర్యంలో రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందించారు.
   

3.ఇటలీ ప్రధాని రాజీనామా

 

Telugu America, Atlanta, Canada, Cia Putins, Kuwait, Nri, Nri Telugu, Oman, Qata

ఇటలీ ప్రధాని మారియో డ్రగే తన పదవికి రాజీనామా చేశారు.రాజీనామా లేఖ ను రాష్ట్రపతి సెర్జియో మార్టేరెల్లాకు అందించారు.
 

4.ప్రపంచవ్యాప్తంగా 14 వేల మంకీ ఫాక్స్ కేసులు

  ప్రపంచవ్యాప్తంగా 14 వేల మంకీ ఫాక్స్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
 

5.పుతిన్ ఆరోగ్యం పై సీఐఏ ప్రకటన

Telugu America, Atlanta, Canada, Cia Putins, Kuwait, Nri, Nri Telugu, Oman, Qata

 రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం పై వస్తున్న వార్తల నేపథ్యంలో దీనిపై ఇంటిలిజెన్స్ సమాచారం లేదని సిఐఏ ప్రకటించింది.
 

6.శ్రీలంక మాజీ అధ్యక్షుడు విషయంలో సింగపూర్ ప్రకటన

  శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటాబాయే రాజపక్స కు ఆశ్రయం కల్పించడంపై సింగపూర్ ప్రకటన చేసింది.కేవలం 14 రోజుల తాత్కాలిక వీసా ను మాత్రమే మంజూరు చేసినట్లు సింగపూర్ ప్రభుత్వం వెల్లడించింది.
 

7.ఉక్రెయిన్ తో దౌత్య సంబంధాలను తెంచుకున్న సిరియా

 ఉక్రెయిన్ తో దౌత్య సంబంధాలను తెంచుకున్నట్లు సిరియా ప్రకటించింది.
 

8.ఐక్యరాజ్యసమితి సమావేశాలకు 157 దేశాల అధిపతులు

 

Telugu America, Atlanta, Canada, Cia Putins, Kuwait, Nri, Nri Telugu, Oman, Qata

ఐక్యరాజ్యసమితి సమావేశాలకు 157 దేశాల అధిపతులు హాజరుకాబోతున్నారు.
 

9.జవాన్ పాస్ పోర్ట్ కు మొదటి స్థానం

  ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్ పోర్ట్ గా జపాన్ పాస్ పోర్ట్ మొదటి స్థానంలో నిలిచింది.

జపాన్ పాస్ పార్టీ కలిగి ఉంటే 193 దేశాలకు ముందస్తు వీసా అవసరం లేకుండా వెళ్లే సదుపాయం ఉంది.ఈ స్థానం లో భారత్ పాస్ పోర్ట్ 5 వ స్థానంలో నిలిచింది.
 

10.గే పెళ్లిళ్లకు అమెరికా దిగువ సభ ఆమోదం

 

Telugu America, Atlanta, Canada, Cia Putins, Kuwait, Nri, Nri Telugu, Oman, Qata

స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ కల్పించే విధంగా అమెరికా చర్యలు చేపట్టింది.ఈ మేరకు దిగువసభలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube