53 మంది వలసదారుల అమెరికా ఆశలు ఆవిరి : టెక్సాస్ ట్రక్కు ఘటనలో ఇద్దరిపై అభియోగాలు

గత నెలలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం శాన్ ఆంటోనియాలోని రోడ్డుపై నిలిపివున్న ట్రక్కులో పదుల సంఖ్యలో వలసదారుల మృతదేహాలు బయటపడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.అమెరికాలోకి ఎలాగైనా ప్రవేశించాలని వీరు చేసిన సాహసం చివరికి అంతులేని విషాదానికి కారణమైంది.

 Grand Jury Indicts 2 Men In Texas Truck Smuggling Case That Left 53 Migrants Dea-TeluguStop.com

ఈ ఘోర దుర్ఘటనపై టెక్సాస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి టెక్సాస్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులపై అభియోగాలు మోపారు.

హోమెరో జమోరానో జూనియర్ (46) , క్రిస్టియన్ మార్టినెజ్ (28)లు శాన్ ఆంటోనియోలోని ఒక మారుమూల ప్రాంతంలో గత నెల చివరిలో 67 మందిని ఒక ట్రక్కు ద్వారా అక్రమంగా అమెరికాలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తేల్చారు.

వలసదారులను అక్రమంగా రవాణా చేసినందుకు , రవాణా చేసేందుకు కుట్ర పన్నినందుకు, ఇందరి మరణాలకు కారణమైనందుకు ఇలా పలు అభియోగాలను వారిపై మోపారు.

అమెరికాకు వలస వచ్చేందుకు ప్రయత్నించిన ఈ బాధితులంతా మెక్సికో, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల, హోండూరాస్‌లకు చెందిన వారిగా గుర్తించారు.వీరిపై నేరం రుజువైతే.జీవిత ఖైదుతో పాటు మరణశిక్షను కూడా ఎదుర్కోవాల్సి వుంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు.

Telugu Martinez, Grandjury, San Antonio, Zamora, Zamorano-Telugu NRI

జూన్ 27న ట్రక్కు ఘటన తర్వాత జమోరానో ఘటనాస్థలికి దగ్గరలో దాక్కున్నట్లు పోలీసులు కనుగొన్నారు.అతని ఫోన్ ను పరిశీలించగా మార్టినెజ్‌తో స్మగ్లింగ్ ఆపరేషన్ గురించి చర్చించిన టెక్స్ట్ మెసేజ్‌లు కనిపించాయి. జమోరానో, మార్టినెజ్‌లు ప్రస్తుతం ఫెడరల్ కస్టడీలో వున్నారు.

ఇక.గ్వాటెమాల నుంచి ప్రాణాలతో బయటపడిన 20 ఏళ్ల యువతి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.బోర్డర్ పెట్రోలింగ్ కుక్కలు వలసదారుల వాసన పసిగట్టకుండా వుండేందుకు వారు చికెన్ పౌడర్‌తో ట్రక్కును కవర్ చేశారని తెలిపింది.

కాగా… ఘటన జరిగిన రోజున కంటైనర్ లో అచేతనంగా పడివున్న 53 మందిని ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.అప్పటికే వీరంతా ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్థారించారు.వీరంతా నమోదుకానీ వలసదారులేనని హోంలాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది.సజీవంగా కనుగొనబడిన వారి శరీరాలు వేడిగా వున్నాయి.వడదెబ్బ, అలసటతో వీరంతా అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు.

కంటైనర్ లోని రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనింగ్ యూనిట్ కూడా పనిచేయడం లేదని శాన్ ఆంటోనియో ఫైర్ చీఫ్ చార్లెస్ హుడ్ మీడియాకు తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube