1.ఎన్నారై టిడిపి ఎగ్జిక్యూటివ్ కమిటీల నియామకం
ఒమన్, ఖతర్, కువైట్ 1,2, యూఏఈ, యూఎన్ ఏ ఎన్నారై టిడిపి ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు నియమించారు.
2.రిషి సునాక్ ను టార్గెట్ చేసిన బోరిక్ జాన్సన్
బ్రిటన్ ప్రధాని బోరిక్ జాన్సన్ రాజీనామా చేయడంతో కాళీ అయిన అధ్యక్ష పీఠానికి జరుగుతున్న ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్ విస్తృతంగా ప్రచారం చేస్తూ ముందంజలో ఉన్నారు.తన పదవిని కోల్పోవడానికి రిషి సునాక్ కారణమని భావిస్తున్న బోరిక్ జాన్సన్ రిషి సునక్ ను తప్ప ఎవరినైనా బలపరచండని తన వర్గం ఎంపీలకు సూచిస్తున్నారట.
3.అమెరికాలో సాహిత్య రంగస్థల వేదికల ఇష్ట గోష్టి
అమెరికాలోని హెర్న డన్ ప్రాంతంలో ప్రవాస ఆంధ్రుల తల్లిదండ్రుల సమక్షంలో తెలుగు సాహిత్య రంగస్థలం వేదికల ఇస్టా గోష్టి కార్యక్రమం జరిగింది.భాను ప్రకాష్ మాగులూరి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించగా ముఖ్యఅతిథిగా గుమ్మడి గోపాలకృష్ణ హాజరయ్యారు.
4.యూఏఈ లో నీట్ పరీక్ష
యూఏఈ లోని మూడు కేంద్రాల్లో నీట్ 2022 పరీక్ష జరగనున్నట్లు దుబాయ్ లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
5.ఇంగ్లాండ్ లో హిట్ ఎమర్జెన్సీ ప్రకటన
రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో బ్రిటన్ వాతావరణ విభాగం తొలిసారి రెడ్ వార్నింగ్ జారీ చేసింది.దీంతో ప్రభుత్వం హీట్ ఎమర్జెన్సీ ని ప్రకటించింది.
6.శ్రీలంకలో పెట్రోల్ కోసం నేషనల్ ఫ్యూయల్ కార్డ్ జారీ
శ్రీలంక లో వారానికి సరిపడా వినియోగదారులకు ఇంధనం సరఫరా కోసం నేషనల్ ఫ్యూయల్ కార్డులను విద్యుత్ ఇంధన మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది.
7.సాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ లో బాంబు కలకలం
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ లో బాంబు ఉందని బెదిరింపు కాల్ రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై ఇంటర్నేషనల్ టెర్మినల్ ను ఖాళీ చేయించారు.
8.అట్లాంటాలో వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం
అమెరికాలోని అట్లాంటా నగరంలో నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) APNRT ఆధ్వర్యంలో HTA వారి సహకారం తో జులై 9న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది.
9.మెక్సికోలో కూలిన హెలికాఫ్టర్
మెక్సికోలు మిలటరీ హెలికాప్టర్ కూలిన ఘటనలో 14 మంది మరణించినట్లు అక్కడ నేవీ తెలిపింది.
10.ట్విట్టర్ డీల్ పై విచారణ వద్దు .కోర్టు ను కోరిన ఎలెన్ మాస్క్
ట్విట్టర్ డీల్ కొనుగోలు ఒప్పందం నుంచి ఎలెన్ మాస్క్ వైదొలగడం పై ట్విట్టర్ కోర్టులో కేసు వేసింది.అయితే దీనిని 2023 వరకు వాయిదా వేయాలని ఎలెన్ మాస్క్ తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు.