అమెరికాలో జైల్లో భారతీయ యువకుడు...నేరం రుజువైతే...!!!

అగ్ర రాజ్యంలో ఉన్నత చదువుల కోసం ఉద్యోగాల కోసం వలసలు వెళ్ళిన భారతీయులు ఎంతో మంది వారి కలలకు తగ్గట్టుగా జీవితాన్ని మలుచుకుంటూ కన్న తల్లి తండ్రులకు, వారి ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుంటే మరి కొందరు మాత్రం తప్పుడు మార్గాలలో ప్రయాణించి చివరకు పోలీసు చేతికి చిక్కి పరువు పోగొట్టుకుంటున్నారు.తాజాగా అమెరికాలో భారత సంతతికి చెందిన యువకుడు చేసిన నేరం స్థానికంగా హాట్ టాపిక్ అయ్యింది.

 Indian Gang Preying On Elders In Us Arrested In Crackdown, Online Fraud,senior C-TeluguStop.com

సుమారు 2 ఏళ్ళుగా మరొక భారతీయ యువకుడితో కలిసి సదరు యువకుడు చేసిన తప్పులు ఒక్కసారిగా బయటపడటంతో ప్రస్తుతం అమెరికా జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో భారత సంతతికి చెందిన 24 ఏళ్ళ అనిరుద్ అనే యువకుడు, భారత సంతతికి చెందిన కు చెందిన మరో యువకుడు మహమద్ ఆజాద్ తో కలిసి గడిచిన 3 ఏళ్ళ పాటు ఆన్లైన్ లో మోసాలకు పాల్పడుతూ వచ్చారు.ఈ క్రమంలోనే పోలీసులు 2020 లో మహ్మద్ ఆజాద్ ను అదుపులోకి తీసుకోగా అనిరుద్ తాజాగా పట్టుబడ్డాడు.

ఇంతకీ వీరిద్దరూ చేసిన నేరమేంటంటే.

అనిరుద్ , అహ్మద్ ఇద్దరూ కలిసి అమెరికాలో 60 ఏళ్ళు పై బడిన సీనియర్ సిటిజన్స్ ను ఎంపిక చేసుకుని వారి ఖాతాలను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ లో దొంగతనాలు చేసేవారు.

ఈ క్రమంలో వారు కోట్లాది రూపాయలు సీనియర్ సిటిజన్స్ నుంచీ కాజేసినట్టుగా తెలుస్తోంది.అయితే వీరితో పాటు మరో ముగ్గురు భారత సంతతికిక్ చెందిన సుమిత్ కుమార్ సింగ్, హిమాన్సు కుమార్, హసీబ్ లపై నేరారోపణలు చేయగా కోర్టు వారిని నిర్దోషులుగా నిర్ధారించి విడిచిపెట్టింది.

అహ్మద్, అనిరుద్ ఇద్దరూ కలిసి సీనియర్ సిటిజన్స్ కు బిజినెస్ లింకులు పంపి వాటి ద్వారా వారి బ్యాంక్ ఖాతాలోకి ప్రవేశించి డబ్బులు కాజేసేవారు.ఇదిలాఉంటే ఈ కేసును పూర్తిగా స్టడీ చేసిన కోర్టు తీర్పును వాయిదా వేసింది.కాగా వీరిద్దరూ చేసిన నేరం రుజువైతే ఒక్కొక్కరికి 20 ఏళ్ళ జైలు జీవితంతో పాటు, రూ.2 కోట్లకు పైగా ఫైన్ కట్టాల్సి వస్తుందని అంటున్నారు న్యాయ నిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube