స్పెల్లింగ్ బీ పోటీల్లో అద్భుత ప్రతిభ... ఇండో అమెరికన్ చిన్నారులకు భారత రాయబారి అభినందనలు

స్పెల్లింగ్ బీ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన భారత సంతతి చిన్నారులకు అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూ అభినందనలు తెలిపారు.వారితో పాటు ఈ పోటీల్లో పాల్గొన్న అందరికీ ఆయన విషెస్ తెలియజేశారు.

 Ambassador Taranjit Singh Sandhu Hails Efforts Of Indo-american Stars Of Spellin-TeluguStop.com

ఈ ట్వీట్‌లో స్పెల్లింగ్ బీ పోటీల్లో పాల్గొన్న పిల్లల ఫోటోను ఆయన పంచుకున్నారు.అమెరికాలో జరిగిన ప్రతిష్టాత్మక స్పెల్లింగ్ బీ పోటీలలో విన్నర్‌, రన్నరప్ రెండూ ట్రోఫీలు భారతీయ చిన్నారులకే దక్కాయి.

టెక్సాస్‌లోని ఆంటోనియోకు చెందిన హరిణి లోగన్ (14) విజేతగా అవతరించింది.అలాగే భారత సంతతికే చెందిన విక్రమ్ రాజు(12) రెండో స్థానంలో నిలిచాడు.విజేతను నిర్ధారించే చివరి రౌండ్‌లోని 90 సెకన్లలో హరిణి ఏకంగా 21 పదాలకు కరెక్ట్ స్పెల్లింగ్స్ చెప్పి విజేతగా నిలిచింది.scyllarian, pyrrolidone, Otukian, Senijextee వంటి కఠినమైన పదాలకి సైతం కరెక్ట్ స్పెల్లింగ్స్ చెప్పి హరిణి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ పోటీల్లో పాల్గొన్న 230 మందిని వెనక్కినెట్టి హరిణి ఈ ఘనత దక్కించుకుంది.ఇక రెండో స్థానంలో నిలిచిన విక్రమ్ రాజు 15 పదాలకు మాత్రమే సరైన స్పెల్లింగ్స్ చెప్పగలిగాడు.హరిణికి జ్ఞాపికతో పాటు రూ.38 లక్షల రివార్డ్ అందజేశారు.ఇక రన్నరప్‌గా నిలిచిన విక్రమ్ రాజుకు రూ.22 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది.ఫైనల్స్‌లో మొత్తం 13 మంది పోటీపడ్డారు.వీరిలో సహస్రద్ సతీష్, ఏకాంష్ రస్తోగి, విక్రమ్ రాజు, అభిలాష్ పటేల్, అలియా అల్పెర్ట్, సహానా శ్రీకాంత్, కిర్‌స్టెన్ శాంటోస్, నిత్యా కతిరవన్, విహాన్ సిబల్, సహర్ష్ వుప్పాల, సూర్య కపుజయ్, హరిణి లోగన్, శివకుమార్ వున్నారు.

Telugu Africanamerican, Antonio, Harini Logan, Vikram, Otukian, Pyrrolidone, Scy

ఇకపోతే.స్పెల్లింగ్ బీ 2021లో భారత సంతతికి చెందిన చైత్ర తుమ్మల రన్నరప్‌తో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఆ ఏడాదికి గాను.లూసియానా రాష్ట్రంలోని హర్వేకు చెందిన అఫ్రికన్ అమెరికన్ జైలా అవంత్ గార్డె(14) విజేతగా నిలిచింది.జైలా, చైత్ర ఇద్దరూ 2015 ‘స్పెల్లింగ్-బీ’ రన్నరప్ వద్ద శిక్షణ పొందారు.స్పెల్లింగ్ బీ 2021 ఫైనల్‌లో “murraya,” అనే పదానికి స్పెల్లింగ్ చెప్పాల్సిందిగా జైలాను న్యాయనిర్ణేతలు అడిగారు.

ఆ వెంటనే ఆమె ఏ మాత్రం తడబడకుండా సరైన సమాధానాన్ని చెప్పింది.“murraya,” అంటే ఉష్ణ మండల ఆసియా, ఆస్ట్రేలియన్ జాతికి చెందిన చెట్టు పేరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube