మన హిందూ సంప్రదాయాల ప్రకారం తులసి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.తులసి చెట్టును లక్ష్మీ దేవిగా భావిస్తూ… ఇంటి ముందు ఓ కోట ఏర్పాటు చేసుకొని అందులో మొక్కను నాటుకోవడం మనం సంప్రదాయం.
అలాగే వాటికి ప్రతిరోజూ పూజ చేస్తూ.నీరు పోయడం, దీపం పెట్టడం కూడా మనకు అలవాటు.అయితే తులసి చెట్టుకు ఈ పూజలన్నీ చేసేది ఆడవాళ్లే.కానీ అదే ఆడవాళ్లు తులసి ఆకులను కోయకూడదని చెప్తుంటారు మన పెద్దలు.అలా ఎందుకు చెప్తారు, అవి మన పురాణాలు చెప్తున్నాయా.లేక పెద్దలే కల్పించి అలా చెప్తున్నారా అనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మన శాస్త్రాలు, పురాణ గ్రాంథాలు తులసిని ఆడవాళ్లు కోయరాదనే చెప్తున్నాయి.ముఖ్యంగా శుక్రవారం, ఆదివారం, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజులలో తులసినీ, ఉసిరి పత్రాన్ని అస్సలే కోయకూడదంట.
అలాగే తులసి మొక్కను నాటడం, తొలగించటం మగ వారు కూడా చేయొద్దట.కానీ మగవారు కోసిన తులసితోనే దేవుళ్లను పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.అలాగే తులసిని ఎప్పుడు పడితే అఫ్పుడు, స్నానం చేయకుండా తెంపరాదు.తులసి ఆకులను కోసెటప్పుడు స్తుతించి, నమస్కరించి పురుషులు మాత్రమే కోయాలి.
మగ వాళ్లు కోసి ఇచ్చిన ఆ ఆకులతో ఆడవాళ్లు పూజలు చేసుకోవచ్చు.అలాగే ఆడవాళ్లు తులసి చెట్టుకు పూజ చేసేటప్పుడు శుచి, శుభ్రత పాటించాలి.
అంటు, ముట్టు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తలసి చెట్టుకు నీళ్లు పోయడం కాని పూజ చేయడం కానీ చేయకూడదు.