అడివి శేష్, సయీ మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మేజర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
అడివి శేష్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో జీవించాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే తాజాగా సందీప్ ఉన్నికృష్ణన్ తల్లీదండ్రులు థియేటర్ లో మేజర్ సినిమాను చూసి ఈ సినిమా గురించి అభిప్రాయాలను పంచుకున్నారు.
సందీప్ తండ్రి కె.ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ ను ప్రతిబింబించే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారని అన్నారు.చాలా మంచి మూవీని తెరకెక్కించారని ఆయన కామెంట్లు చేశారు.మేజర్ చిత్రయూనిట్ కు మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.సినిమాలో కెమెరా వర్క్ , యాక్టర్ల నటన ఎంతో బాగుందని వాళ్ల నటన తన దుఃఖాన్ని మరిచిపోయేలా చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.
సందీప్ చనిపోయాడని చాలామంది అనుకుంటున్నారని అయితే తుదిశ్వాస వరకు సందీప్ ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశాడని ఆయన వెల్లడించారు.
అది ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని నా కెరీర్ ను హైదరాబాద్ లోనే మొదలుపెట్టానని ఆయన కామెంట్లు చేశారు.సందీప్ తో కలిసి హైదరాబాద్ లో జీవించానని అతనితో మంచి సమయం గడిపానని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నందుకు గర్వపడుతున్నానని హైదరాబాద్ కు మళ్లీ వస్తానని ఆయన తెలిపారు.కె.ఉన్నికృష్ణన్ మాట్లాడే సమయంలో తల్లి ధనలక్ష్మి సందీప్ ను తలచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.మరోవైపు మేజర్ మూవీ బుకింగ్స్ బాగున్నాయి.
కమర్షియల్ గా కూడా ఈ సినిమా సక్సెస్ సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.ఈ సినిమా నిర్మాతలలో మహేష్ బాబు ఒకరు కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
సినిమాసినిమాకు మహేష్ బాబుకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.