బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడుగా కొనసాగుతున్న ఈయన గత కొంత కాలం నుంచి తన కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు గురించి ఎంతో ఆందోళన చెందారు.
తాజాగా తన కుమారుడు ఆర్యన్ ఖాన్ కు అధికారులు క్లీన్ చిట్ ఇవ్వడంతో షారుక్ ఎంతో ఉపశమనం పొందారు.అయితే తాజాగా మరోసారి ముంబై పోలీసుల నుంచి షారుక్ ఖాన్ కు నోటీసులు అందాయి.
ఇలా ముంబై పోలీసులు షారుక్ ఖాన్ కు నోటీసులు జారీ చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… షారుక్ ముంబైలో నివసిస్తున్న ఇల్లు మన్నత్ అంటే తనకు ఎంత ఇష్టమో మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తన ఇంటికి మెరుగులు దిద్దుతూ తన ఇంటిని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తన ఇంటికి మన్నత్ అనే నేమ్ బోర్డ్ తయారు చేయించడం కోసం యూరప్ నుంచి ప్రత్యేకంగా స్టోన్ తెప్పించి 25 లక్షల రూపాయలు ఖర్చు చేసి తన భార్య గౌరీఖాన్ ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు.
ఈ విధంగా ఇంటి నేమ్ బోర్డ్ కోసం 25 లక్షల రూపాయలు ఖర్చు చేయడంతో అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు.అయితే తాజాగా షారుక్ తన ఇంటికి వేసిన నేమ్ బోర్డు తొలగించాలని ముంబై పోలీసులు నోటీసులు ద్వారా వెల్లడించారు.ఈ ఇంటి నేమ్ బోర్డు కోసం ఉపయోగించిన స్టోన్ ఎంతో ఖరీదైనది దీనిని దొంగలు దొంగతనం చేసే అవకాశం ఉందని ఈ నేమ్ బోర్డు కాపలా ఉండడం పోలీసులకు కష్టతరం కావడంతో వెంటనే నేమ్ బోర్డు తొలగించాలని అలా చేయని పక్షంలో పోలీసులు తొలగిస్తామని నోటీసులు జారీ చేశారు.
ఇక చేసేదేమీలేక షారుక్ ఖాన్ ఎంతో ఇష్టంగా తయారు చేయించుకున్న నేమ్ బోర్డ్ తీసేసినట్లు తెలుస్తోంది.