ఖమ్మంలో వెంటనే మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి:- సిపిఎం పార్టీ డిమాండ్

గత బడ్జెట్ లో ఖమ్మంకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చెసింది అని, కానీ ఇంతవరకు కాలేజీ ఏర్పాటుకు చర్యలు ప్రారంభం చేయలేదు అని వెంటనే త్వరితగతిన మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా CPM కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు .ఆదివారం సుందరయ్య భవన్ లో జరిగిన ఖమ్మం నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 Medical College Should Be Set Up In Khammam Immediately: - Cpm Party Demand-TeluguStop.com

ఖమ్మం నగరంలో వైద్యం, విద్యా అవసరాలు బాగా పెరిగాయి అని, చుట్టూ పక్కల జిల్లాల ప్రజలు ఖమ్మం నగరంలోకి వస్తున్నారు అని ఈనేపథ్యంలో ఖమ్మం నగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో నాయకులు వై విక్రమ్, యర్రా శ్రీనివాసరావు, తిరుపతి రావు, మీరా సాహిబ్, రమ్యా, నవీన్ రెడ్డి, బోడపట్ల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube