విద్యార్థుల్ని చదువుతోపాటు ఆటలు, డ్రాయింగ్, క్రాఫ్ట్ తదితర అంశాల్లోనూ ప్రోత్సహించాలి : కలెక్టర్ విపి గౌతమ్

గురువారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో విద్యాధికారులు, పిటిఐలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 61 పిటిఐలు, 14 మంది రెగ్యులర్ మొత్తంగా 75 మంది ఉపాధ్యాయులు ఉన్నారన్నారు.

 Besides Studies, Students Should Be Encouraged In Games, Drawing, Craft Etc.: Co-TeluguStop.com

ఇందులో ఆర్ట్, డ్రాయింగ్ కు సంబంధించి 17, క్రాఫ్ట్, వర్క్ ఎడ్యుకేషన్ కు సంబంధించి 48 మంది, ఫిజికల్, హెల్త్ ఎడ్యుకేషన్ కు సంబంధించి 8 మంది, ఓకేషనల్ కు సంబంధించి ఇద్దరు ఉన్నారన్నారు.పాఠశాలల్లో వీటికి సబంధించి తరగతులు చేపట్టాలన్నారు.

నగరంలో సర్దార్ పటేల్ స్టేడియం, వైరా ఇండోర్ స్టేడియం ఆధునిక సౌకర్యాలతో అందుబాటులో ఉన్నాయని, కల్లూరు, మధుర లలో నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్ని స్టేడియాలకు పంపి, వారిని వారి వారి ఆసక్తి ఉన్న క్రీడల్లో ప్రోత్సహించి, వారిని ఉన్నతంగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

కబడ్డీ, ఖో ఖో ఆటలే కాక, అథ్లెటిక్స్, స్విమ్మింగ్ లలో ప్రోత్సాహం ఇవ్వాలని, ఇందులో వ్యక్తిగతంగా ఒక్కొక్కరే 5 నుండి 10 మెడల్స్ సాధించవచ్చన్నారు.ఫలితం దిశగా చర్యలు చేపట్టాలని, ఒక లక్ష్యం ఏర్పరచుకొని, లక్ష్య సాధనకు ప్రోత్సాహం, ప్రేరణ కల్పించాలన్నారు.

జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలకు విద్యార్థులను తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు.మార్కెట్ లో డిమాండ్ ఉన్న క్రాఫ్ట్ లపై శిక్షణ ఇవ్వాలని, రేపు అది ఆదాయ వనరుగా అవ్వాలని ఆయన అన్నారు.

ప్రతిభ ఉన్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి, వారిని ఆయా విభాగాల్లో మెరుగుపట్టాలని కలెక్టర్ అన్నారు.ఈ సందర్భంగా గొల్లపాడు పోలేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆర్ట్ ఉపాధ్యాయుడు పి.రామకృష్ణ తాను గీసిన జిల్లా కలెక్టర్ చిత్రపటాన్ని కలెక్టర్ కు బహుకరించారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య, మండల విద్యాధికారులు, సెక్టార్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube