పోలీస్ సిబ్బంది సంక్షేమంలో భాగంగా పోలీస్ సిబ్బందికి ఆరోగ్యపరమైన సమస్యలు పరిక్షలు నిర్వహించి ఏదైనా అనారోగ్య సమస్యలు వుంటే సత్వరం పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ సూచనల మేరకు నగరంలోని పలువురు వైద్య బృందం మెడికల్ హెల్త్ చెకప్ క్యాంపు పోలీస్ హెడ్ క్వార్టర్స్, పోలీస్ కళ్యాణ మండపంలో నిర్వహించారు.
కార్యక్రమానికి హజరైన అడిషనల్ డీసిపీ (AR)మాట్లాడుతూ .మారుతున్న మనిషి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం నేపథ్యంలో వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.విధినిర్వహణలో నిమగ్నమై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులు అత్యవసర సమయాలలో మెరుగైన వైద్యం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఆవకాశన్ని సద్వినియోగం చేసుకొని వైద్య పరీక్షలు చేయించుకోవడాన్ని అలవాటు చేసుకోవాలని కోరారు.
అదేవిధంగా స్ధానిక పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో వుంటూ సహాయ సహకారాలు అందించి ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించడానికి కృషి చేయాలని సూచించారు.
గుండె వైద్య నిపుణులు, క్యాన్సర్ వైద్య నిపుణులు, చిన్న పిల్లల వైద్యలు, సాదారణ వైద్య నిపుణులు హజరై పరిక్షలు నిర్వహించారు.కార్యక్రమంలో డాక్టర్ సీతారాం (కార్డిఓలోజిస్ట్)డాక్టర్ అల్లూరి (సర్జికల్ అనకాళోజిస్ట్) డాక్టర్ భార్గవ్ (పేడియాట్రిషన్) డాక్టర్ జితేంధర్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్) స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ప్రసన్న కుమార్ , సిఐ సత్యనారాయణ రెడ్డి, రిజర్వ్ ఇన్స్‌పెక్టర్లు రవి, శ్రీనివాస్ , శ్రీశైలం,తిరుపతి పాల్గొన్నారు.