ఎన్టీఆర్ తో పోల్చడంతో చాలా సంతోషంగా ఉంది.. విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన అశోకవనంలో అర్జున కళ్యాణం పాజిటివ్ టాక్ తో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.తొలిరోజు ఈ సినిమా 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా కలెక్షన్లను సాధించిందని తెలుస్తోంది.

 Hero Vishwak Sen Comments About Ntr Viral In Social Media Details Here , Vishwak-TeluguStop.com

ఈ వీకెండ్ నాటికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.హీరో విశ్వక్ సేన్ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే.

పాగల్ సినిమాలో విశ్వక్ సేన్ ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేశారని కామెంట్లు వినిపించాయి.

అయితే వైరల్ అయిన కామెంట్లు తన దృష్టికి రావడంతో విశ్వక్ సేన్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

నన్ను కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చుతున్నారని అలా పోల్చడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.జూనియర్ ఎన్టీఆర్ గొప్ప డ్యాన్సర్ అని గొప్ప స్టార్ అని తారక్ తో పోల్చడం సంతోషాన్ని కలిగిస్తున్నా తాను తనదైన గుర్తింపును మాత్రమే కోరుకుంటానని విశ్వక్ సేన్ తెలిపారు.

నటన విషయంలో తనపై తారక్ ప్రభావం లేదని విశ్వన్ సేన్ పేర్కొన్నారు.

తాను జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఎక్కువగా చూస్తుంటానని ఎన్టీఅర్ మేనరిజమ్స్ కనిపిస్తున్నాయంటే అది తారక్ పై ఉండే అభిమానం వల్లే కావచ్చని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు.

తారక్ సినిమాలలో యమదొంగ మూవీని తాను లైక్ చేస్తానని తెలుగుపై పట్టు ఉంటే మాత్రమే అలాంటి పౌరాణిక డైలాగ్స్ చెప్పడం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.తాను తారక్ లా డైలాగ్స్ చెప్పలేనని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Ntr, Pagal, Tollywood, Vishwak Sen-Movie

పౌరాణిక పాత్రలను తారక్ బాగా చేస్తారని అలాంటి పాత్రలను మరొకరు చేయడం సాహసమే అవుతుందని ఆయన కామెంట్లు చేశారు.గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలను చేస్తానని విశ్వన్ సేన్ కామెంట్లు చేశారు.విశ్వక్ సేన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube