ఇది నిజామా.. కేజీఎఫ్ 3లో రానా దగ్గుబాటి.. వైరల్ అవుతున్న వార్త!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటించిన తాజా చిత్రం కేజీఎఫ్ 2.ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

 Big Update Is Rana Acting In Kgf3 Movie , Rana , Kgf 3 , Yash , Kgf 2 , Prashant-TeluguStop.com

గత నెల ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా ఇప్పటికి సక్సెస్ ఫుల్ గానే కొనసాగుతోంది. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాల మాదిరిగానే 1000 కోట్ల మార్కును దాటి ఇండియన్ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పటికి ఈ సినిమా హిందీ వెర్షన్ లో బాక్సాఫీసు వద్ద ఒక్కొక రికార్డును బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోతోంది.అయితే కేజిఎఫ్ సినిమా ఎప్పుడెప్పుడా విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు.

ఇక ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా విడుదలై ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కేజిఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ ఉండబోతున్నట్లు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

కేజిఎఫ్ 3 సినిమా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే కేజీఎఫ్ చాప్టర్ 3 ఉంటుంది అని హింట్ దొరికినప్పటి నుంచి ఎవరికివారు ఎవరికి తోచిన విధంగా వాళ్లే స్టోరీలను అల్లేసుకుంటున్నారు.

కేజిఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 లో విలన్లు చనిపోయారు. క్లైమాక్స్ లో కూడా హీరో చనిపోయిన విషయం తెలిసిందే.

Telugu Bahubali, Kgf, Prashant Neel, Rana, Villain, Yash-Movie

మరి కేజిఎఫ్ 3 సినిమాలో హీరో ఏవిధంగా బతికాడు అన్నది తెలిసిపోతుంది.ఈ క్రమంలోనే కేజిఎఫ్ చాప్టర్ 3 సినిమాలో విలన్ గా ఎవరు ఉండబోతున్నారు అన్న ప్రశ్న ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.అయితే ఈ సినిమాలో విలన్ గా రానా నటించబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇటీవల రానా ట్విట్టర్ లో కేజీఎఫ్ 2 సినిమా గురించి పొగుడుతూ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ పై ప్రశాంత్ నీళ్లు స్పందిస్తూ త్వరలోనే కలుద్దాం అన్న విధంగా రాసుకొచ్చారు.

అయితే కేజీఎఫ్ 3 ఈ సినిమాలో రానా విలన్ గా నటించబోతున్నాడు అన్న వార్తల కి ఈ ట్వీట్ మరింత ఆజ్యం చేకూర్చిన్నట్లు అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube