ఇది నిజామా.. కేజీఎఫ్ 3లో రానా దగ్గుబాటి.. వైరల్ అవుతున్న వార్త!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటించిన తాజా చిత్రం కేజీఎఫ్ 2.

ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

గత నెల ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా ఇప్పటికి సక్సెస్ ఫుల్ గానే కొనసాగుతోంది.

బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాల మాదిరిగానే 1000 కోట్ల మార్కును దాటి ఇండియన్ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పటికి ఈ సినిమా హిందీ వెర్షన్ లో బాక్సాఫీసు వద్ద ఒక్కొక రికార్డును బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోతోంది.

అయితే కేజిఎఫ్ సినిమా ఎప్పుడెప్పుడా విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు.

ఇక ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా విడుదలై ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కేజిఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ ఉండబోతున్నట్లు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

కేజిఎఫ్ 3 సినిమా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే కేజీఎఫ్ చాప్టర్ 3 ఉంటుంది అని హింట్ దొరికినప్పటి నుంచి ఎవరికివారు ఎవరికి తోచిన విధంగా వాళ్లే స్టోరీలను అల్లేసుకుంటున్నారు.

కేజిఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 లో విలన్లు చనిపోయారు.క్లైమాక్స్ లో కూడా హీరో చనిపోయిన విషయం తెలిసిందే.

"""/" / మరి కేజిఎఫ్ 3 సినిమాలో హీరో ఏవిధంగా బతికాడు అన్నది తెలిసిపోతుంది.

ఈ క్రమంలోనే కేజిఎఫ్ చాప్టర్ 3 సినిమాలో విలన్ గా ఎవరు ఉండబోతున్నారు అన్న ప్రశ్న ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ సినిమాలో విలన్ గా రానా నటించబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇటీవల రానా ట్విట్టర్ లో కేజీఎఫ్ 2 సినిమా గురించి పొగుడుతూ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ పై ప్రశాంత్ నీళ్లు స్పందిస్తూ త్వరలోనే కలుద్దాం అన్న విధంగా రాసుకొచ్చారు.

అయితే కేజీఎఫ్ 3 ఈ సినిమాలో రానా విలన్ గా నటించబోతున్నాడు అన్న వార్తల కి ఈ ట్వీట్ మరింత ఆజ్యం చేకూర్చిన్నట్లు అయ్యింది.

హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ ఇన్సిడెంట్.. గాల్లోకి బంతిలా ఎగిరిన అమ్మాయి..?