'సీతా రామం' మూవీ విడుదల ఎప్పుడంటే..!

దుల్కర్ సల్మాన్‌ హీరోగా మృనాల్ ఠాకూర్‌ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సీతా రామం సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్‌ లో రాబోతుండటం వల్ల సినిమా పై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

 Dulquer Salman And Hanu Raghavapudi Sita Ramam Release Date Dulquer Salman, Han-TeluguStop.com

అంతే కాకుండా ఈ సినిమా లో పుష్ప స్టార్‌ రష్మిక మందన్నా కీలక పాత్రలో నటిస్తుంది.ఆమె ఈ సినిమాలో హీరోయిన్ కాదు.

కాని ఒక హీరో రేంజ్ పాత్రలో ఆమె కనిపించబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఇటీవల దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ సినిమా లో ఆమె పాత్ర ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుందని చెప్పుకొచ్చాడు.

సినిమా లో ఆమె కనిపించినంత సమయం అద్బుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్న నేపథ్యంలో రష్మిక మందన్నా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కరోనా వల్లఆలస్యం అయిన ఈ సినిమా ను త్వరలో విడుదల చేయబోతున్నారు.

అదుగో ఇదుగో అంటూ వాయిదా వేస్తూ వచ్చిన ఈ సినిమా ను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.ఇప్పటి వరకు సీతా రామం సినిమా విడుదల విషయంలో వైజయంతి మూవీస్ వారు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

కాని త్వరలోనే సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు సిద్దం అయ్యారు.ఇప్పటికే సినిమాను వచ్చే ఆగస్టు లో విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.ఆగస్టు లో పెద్ద సినిమాలు ఉన్న నేపథ్యంలో ఒక సరైన సమయం లో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారట.దుల్కర్ సల్మాన్ కు మహానటి సినిమా తో మంచి గుర్తింపు దక్కింది.

తెలుగు లో ఆయన ఒక స్టార్‌ గా మంచి పేరు దక్కించుకున్నాడు.కనుక సీతారామం సినిమా తో ఖచ్చితంగా దుల్కర్ మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆగస్టు లో వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా సీతారామం ఒక అద్బుతమైన దృశ్య కావ్యంగా ఉంటుందనే నమ్మకం కలుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube