తెలుగు సినీ ప్రేక్షకులకు స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తాజాగా సుదీప్ హింది బాష పై చేసిన వాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.
హిందీ జాతీయ బాష కాదు అంటూ వ్యాఖ్యలు చేసాడు సుదీప్.సుదీప్ చేసిన వ్యాఖ్యలకు ఒక వర్గం ప్రేక్షకుల నుంచి వ్యతిరేకంగా మోడల్ వినిపిస్తున్నాయి.
తాజా చిత్రం విక్రాంత్ రోణ ప్రమోషన్‌లో భాగంగా సుదీప్ కేజీయఫ్ 2పై ప్రశంసలు కురిపిస్తూ ఈ క్రమంలో ఆయన హిందీ భాషపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలకు బాలీవుడ్ స్టార్ హీరో అయినా అజయ్ దేవ్ గన్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు.
సుదీప్ ని ట్యాగ్ చేస్తూ మీరు చెప్పినట్టుగా హిందీ జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు అని ప్రశ్నించాడు.హిందీ బాష ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన అంటూ సమాధానమిచ్చాడు అజయ్ దేవగన్.
వెంటనే సుదీప్ ట్వీట్‌కు స్పందిస్తూ.హలో అజయ్ సార్.
నా వ్యాఖ్యలకు అర్థం అది కాదు.మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు.
మిమ్మల్ని వ్యక్తిగతం కలిసినప్పుడు దీనికి మీకు వివరణ ఇస్తాను అని చెప్పుకొచ్చాడు.
అదేవిధంగా మరొక ట్వీట్ చేస్తూ భారతదేశంలోని అన్ని భాషలపై తనకు గౌరవం ఉందని, అయితే ఇక ఇక్కడితో ఈ టాపిక్‌ను వదిలేయాలనుకుంటున్నాను అంటూ సుదీప్ వరస ట్వీట్స్ చేశాడు.అప్పుడు ఆ ట్వీట్ అజయ్ స్పందిస్తూ ఎలాంటి అపార్థాలు చోటు చేసుకోకుండా దీనికి స్పష్టత ఇచ్చినందుకు ధన్యవాదాలు మై ఫ్రెండ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం అని నా అభిప్రాయం.
మనమంత దేశంలోని అన్ని భాషలను గౌరవించాలి అంటూ రిప్లై ఇచ్చాడు అజయ్.ఇలా వారిద్దరి మధ్య ట్వీట్ వార్ నెలకొంది.