కాంగ్రెస్ లో చేరితే పీకే కు ఆ పదవి ? 

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది.బిజెపి పై పెరుగుతున్న వ్యతిరేకత కాంగ్రెస్ కు కలిసి వచ్చే విధంగా ప్లాన్ చేస్తోంది.

 Sonia Gandhi Is Considering Giving The Post Of Congress National General Secreta-TeluguStop.com

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రంగానే ఉండడం, బిజెపిపై జనాల్లో వ్యతిరేకత పెరుగుతుండడంతో దానిని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే విషయాల్లో విఫలమయ్యామనే విషయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఒప్పుకుంటోంది.ఈ క్రమంలోనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పార్టీలో చేర్చుకుని,  ఆయనకు కీలకమైన పదవి అప్పగించాలని నిర్ణయించుకుంది.

ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ సోనియా గాంధీతో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా అనేక కీలక సూచనలు చేశారు.

ఇదిలా ఉంటే మే 13 నుంచి మేధోమదన సదస్సు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
       దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 400 మంది సీనియర్ నాయకులను ఈ సదస్సుకు ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాజస్థాన్ లోని ఉదయపూర్ మే 13 నుంచి 15 వరకు ‘ చింతన్ శిబిర్ ‘ జరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి చెందడంతో మళ్లీ పార్టీకి పునర్ వైభవం ఏ విధంగా తీసుకురావాలి అనే అంశం పైన ఈ సదస్సులో చర్చించ బోతున్నారు.

అలాగే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పార్టీలో చేర్చుకుని ఆయనకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించాలనే ఆలోచనలో సోనియా ఉన్నారట.ఇటీవల ప్రశాంత్ కిషోర్ తో సోనీయా గాంధీ భేటీ అయ్యారు.

ఆ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు .అలాగే ఆ తర్వాత నిర్వహించిన సమావేశంలో సీనియర్ నాయకులు కమలనాథ్, జైరాం రమేష్ , కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్, రణదీప్ సూర్జేవాలా తోనూ భేటీ అయ్యారు.
 

Telugu Congress, Pk, Priyanka Gandhi, Rahul Gandhi, Sonia Gandhi-Telugu Politica

    ఈ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొన్నారు.ఇక పై  ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలను అమలు చేసి కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకురావాలి అనే నిర్ణయానికి సోనియా వచ్చారట.అందుకే ప్రశాంత్ కిషోర్ కు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా చేయాలని సోనియా నిర్ణయించుకున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube