పేద,మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ప్రతి నెల ఉచిత మెడికల్ క్యాంప్

CPM పార్టీ టూ టౌన్ కమిటీ, బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని మంచికంటి హాల్ లో శనివారం నిర్వహించిన మెడికల్ క్యాంపు కు జిల్లా వ్యాప్తంగా పేదలు,మధ్యతరగతి ప్రజలు నుంచి విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా వందలాది మంది పేషెంట్ లకు డాక్టర్లు పరిక్షలు చేసి ఉచితంగా నెలకు సరిపడా మందులు అందజేశారు.

 Free Medical Camp Every Month Available To Poor, Middle Class People-TeluguStop.com

గత నాలుగు సంవత్సరాలుగా దాతలు సహాయ సహకరాలతో ప్రతి నెలా మొదటి శనివారం ఉచిత బిపి, షుగర్, కంటి , చెవి, ముక్కు, గొంతు పరిక్షలు నిర్వహిస్తున్నామని, ఈరోజు నుంచి వాటితో పాటు ప్రతి నెలా థైరాయిడ్ పరిక్ష కూడా పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తారని సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే కాలంలో మరింతగా ఉచితంగా ఇక్కడ వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.

ఉదయం అల్పాహారాన్ని కూడా అందజేస్తున్నామని, ఈ అవకాశన్నీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పేదలు, మధ్య తరగతి ప్రజలు హాస్పిటల్లో ఫీజులు కట్టలేక ఆస్తులు అమ్ముకుంటున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు.

వైద్యం, విద్యా రంగానికి ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేయడం లేదు అని విమర్శించారు.ప్రజలందరికీ ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో మెడికల్ క్యాంప్ లో ప్రముఖ డాక్టర్లు చీకటి భారవి, కొల్లి అనుదీప్, పిల్లలమర్రి సుబ్బారావు, జెట్ల రంగారావు, పేషెంట్లను పరిక్షించారు.తిరిగి వచ్చే నెల మెదటి శనివారం మెడికల్ క్యాంపు వుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, వై శ్రీనివాసరావు, బి సుదర్శన్, నర్రా రమేష్ శివనారయణ, పి ఝాన్సీ, రామారావు, అఫ్జల్, వాసిరెడ్డి వీరభద్రం , నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube