టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే స్థాయి ఉన్న స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తే తమ ఫేవరెట్ హీరోకు ప్రాధాన్యత కొంచెం తగ్గినా ఫీలవుతారనే సంగతి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు ప్రాధాన్యత తగ్గిందని తారక్ అభిమానులు తెగ ఫీలవుతున్నారు.
తన రోల్ విషయంలో ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తనకు వచ్చిన పేరు విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నానని తారక్ చెప్పినా అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చరణ్, తారక్ పాత్రలను బ్యాలెన్స్ చేసే విషయంలో జక్కన్న కొన్ని పొరపాట్లు చేశారని తారక్ అభిమానులు ఫీలవుతున్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ విషయంలో హర్ట్ అయిన కొందరు తారక్ అభిమానులు రాజమౌళికి కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని, జక్కన్నను అసభ్యకరంగా తిట్టారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.అయితే రాజమౌళి స్పందించి వివరణ ఇస్తే మాత్రమే ఈ వార్తల్లో నిజానిజాలు తెలిసే ఛాన్స్ ఉంటుంది.
ఆర్ఆర్ఆర్ మూవీ యూఎస్ లో ఇప్పటికే 10 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించింది.ఫుల్ రన్ లో ఈ సినిమా అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు భారీస్థాయిలో లాభాలను అందించడం గ్యారంటీ అని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితులలో రాజమౌళి ఒకరనే సంగతి తెలిసిందే.జక్కన్న వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని తారక్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.జక్కన్న తారక్ కాంబినేషన్ లో 4 సినిమాలు వచ్చాయి.
ఒక సందర్భంలో తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే హీరో జూనియర్ ఎన్టీఆర్ అని స్వయంగా రాజమౌళి వెల్లడించారు.ఎన్టీఆర్ నాలుగేళ్లు ఆర్ఆర్ఆర్ మూవీకే పరిమితమైనా చరణ్ హైలెట్ అయిన స్థాయిలో ఎన్టీఆర్ హైలెట్ కాలేదని కామెంట్లు వినిపించాయి.జక్కన్న ఆర్ఆర్ఆర్ పాత్రల గురించి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.