రక్తదానం చేద్దాం..తలసేమియా చిన్నారులకు ఊపిరి నింపుదాం:- మేయర్ నీరజ

రక్తాన్ని దానం చేసిన వాళ్ళు ప్రాణదాతలుగా కీర్తించబడతారని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ అభిప్రాయపడ్డారు ఖమ్మం కార్పొరేషన్ పరిధి 26వ డివిజన్ చర్చి కాంపౌండ్ ముత్యాలమ్మ గుడి సెంటర్ లోని చర్చి కమ్యూనిటీ హాల్ లో “హెల్పింగ్ హార్ట్స్ ఫర్ ది పీపుల్” స్వచ్ఛంద సంస్థ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తలసేమియా చిన్నారుల కోసం డాక్టర్ పారా ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రక్త దానం కంటే విలువైన దానం మరొకటి లేదన్నారు.

 Let's Donate Blood..let's Suffocate Children With Thalassemia: - Mayor N-TeluguStop.com

ఏ లాబ్ లోను ఉత్పత్తి చేయలేని రక్తాన్ని కేవలం మానవత్వంతో మాత్రమే తోటి వారికి అందించగలమని పేర్కొన్నారు.అందుకే ప్రతి ఒక్కరూ రక్త దాత కావాలని పిలుపునిచ్చారు.

డాక్టర్ పారా ఉదయ్ ఉత్సాహవంతులైన యువకులతో ట్రస్టును ఏర్పాటు చేసి అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలను గత ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉండటం అభినందనీయమన్నారు.రక్తదాన శిబిరం ద్వారా ఆపదలో ఉన్న ఎంతో మంది తలసేమియా చిన్నారులను ఆదుకుంటున్నందుకు పార ఉదయ్ ఔదార్యాన్ని ఆమె కొనియాడారు.

వారికి మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.ఈ సందర్భంగా పారా ఉదయ్ మాట్లాడుతూ మంత్రి అజయ్ చొరవతో ప్రభుత్వ హాస్పిటల్ లో కూడా రక్త నిధిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

బుధవారం నిర్వహించిన శిబిరంలో 162 మంది రక్తదానం చేశారని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.యువత రాజకీయాల్లోకి రావడంతో పాటు సోషల్ సర్వీస్ లో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.15 నుంచి 30 సంవత్సరాల వయసు పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యం అవుతుండటం బాధాకరమన్నారు.వ్యసనాలకు బానిసలు కాకుండా సేవా మార్గంలో యువత ప్రయాణం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పోరేటర్లు కర్నాటి కృష్ణ, గోళ్ళ చంద్రకళ, రాపర్తి శరత్, B.G.క్లెమెంట్, బుడిగం శ్రీను, పార సత్యనారాయణ, ఏఎంసీ చైర్ పర్సన్ లక్ష్మి ప్రసన్న, మున్నూరు కాపు రాష్ట్ర కార్యదర్శి ఆకుల గాంధీ, వన్ టౌన్ సి.ఐ.చిట్టి బాబు, ఆర్ జె సి కృష్ణ, టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, మంత్రి వ్యక్తిగత సహాయకులు చిరుమామిళ్ళ రవి కిరణ్, అన్నం శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి, రాజా, మాటేటి కిరణ్, సంస్థ కో ఆర్డినేటర్లు నగేష్, శిరిడి, రమణ, శివ, శ్రీకాంత్, రాజేష్, ఉదయ్ కిరణ్, సునీల్, అశ్వనాధ్, రాకేష్, దత్త, సతీష్, సరాబాబు, రాజకుమార్, పృద్వీరాజ్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube