గౌతమ్ అదానీ గురించి తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు.ఈ బిలియనీర్ ఆస్తుల విలువ రోజురోజుకూ పెరిగిపోతుంది.
ఇండియాలో టాప్ సంపన్నుడు అయిన ముఖేష్ అంబానీని అదానీ చాలా సార్లు బీట్ చేసి తొలి స్థానంలో కూడా నిలిచారు.ఫోర్బ్స్ ప్రకటించే జాబితాలో ఎప్పుడూ ఇతని పేరు ఎక్కువగా ఉంటుంది.
అటువంటి గౌతమ్ అదానీ కూడా చావు అంచుల దాకా వెళ్లొచ్చానని చెప్పాడు.ఇది విని చాలా మంది షాక్ కు గురయ్యారు.
చుట్టూ ఎప్పుడూ అత్యంత సెక్యూరిటీతో ఉండే గౌతమ్ అదానీకి చావు ఎలా ఎదురొచ్చిందబ్బా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.గుజరాత్ లో జన్మించిన అదానీ ముంబైకి పని కోసం వలస వచ్చాడు.
అక్కడ మహేంద్ర బ్రదర్స్ వద్ద వజ్రాల వ్యాపారంలో పనికి కుదిరిన అదానీ కొన్ని రోజుల్లోనే సొంతంగా బిజినెస్ పెట్టే స్థాయికి చేరుకున్నారు.
ఇలా అదానీ సొంతంగా బిజినెస్ ప్రారంభించిన తర్వాత అతడు తన సొంత రాష్ట్రమైన గుజరాత్ కి వెళ్లిపోయారు.
అక్కడికి వెళ్లిన అదానీ అదానీ ఎక్స్ పోర్ట్స్ పేరుతో కమోడిటీ బిజినెస్ స్టార్ట్ చేశారు.ఇక ఈ బిజినెస్ కూడా మంచి లాభాలను తీసుకురావడంతో ఆయనకు డబ్బు విపరీతంగా వచ్చి చేరింది.
దీంతో అతడి శత్రువులు కొందరు డబ్బు కోసం అతడిని కిడ్నాప్ చేశారు.విడుదల చేయాలంటే రూ.11 కోట్లు ఇవ్వాలని కుటుంబాన్ని బెదిరించారు.ఆ సమయంలో పాయింట్ బ్లాంక్ లో అదానీకి గన్ను పెట్టారు.
ఇక 2008లో ముంబైలోని తాజ్ హోటల్ మీద పాకిస్తానీ తీవ్రవాదులు దాడులకు తెగబడ్డ విషయం తెలిసిందే.ఈ సమయంలో అదానీ అదే హోటళ్లో ఉన్నారు.ఇలా రెండు సార్లు అదానీ చావు నుంచి త్పపించుకున్నారు.ఇంకో విషయం అదానీ కాలేజ్ డ్రాప్ అవుట్ స్టూడెంట్.