నదీ పుష్కరాల గురించి అందరికీ తెలుసు.. కానీ అ ఎలా వస్తాయో తెలుసా?

సమస్త ప్రాణకోటి మనుగడకు జలమే ఆధారం.అయితే జలం పుట్టిన తరువాతే జీవకోటి ఉద్భవించింది.

 Do You Know The Nadi Pushkars, Pushkaras , Ganga , Narmada , Yamuna , Simha Rasi-TeluguStop.com

జలాధారాల వెంటనే తొలుత నాగరికత విస్తరించింది.అలాంటి జలాన్ని దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం.

అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాగ స్నానాలు (బలవంత మాగస్నానాలు), మంగళ స్నానాలు అని హిందూ సాంప్రదాయం నీటితో ముడి పడి ఉంది.అలాగే తీర్ధయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది.

శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే.అయితే నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్య ప్రథమని మన పెద్దలు చెబుతుంటారు.

అయితే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మనకు 12 పుష్కరాలు వస్తుంటాయి.
అవెలా వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గురుడు మేషరాశియందు ఉంటే గంగా పుష్కరం వస్తుంది.అలాగే గురుడు వృశభ రాశిలో ఉంటే నర్మదా పుష్కరం, మిధున రాశిలో ఉండే సరస్వతీ పుష్కరం, కటకరాశిలో ఉంటే యమునా నది పుష్కరం, సింహరాశి యందు ఉంటే గౌతమీ నదీ పుష్కరం, కన్యారాశి యందు ఉంటే క్రిష్ణవేణీ నది పుష్కరం, తులా రాసియందు ఉంటే కావేరీ నదీ పుష్కరం, వృశ్చిక రాశియందు ఉంటే తామ్రపర్ణి నదీ పుష్కరం, ధనూ రాశి నందు ఉంటే సింధునది పుష్కరం, మకర రాశి యందు ఉంటే తుంగభద్ర నది పుష్కరం, కుంభ రాశి యందు భీమానది పుష్కరం, గురుడు మీర రాశి యందు ఉంటే… తపతీ నది పుష్కరం వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube