అలా చేస్తే నేను అస్సలు భరించలేను.. షణ్ముఖ్ జశ్వంత్ కామెంట్స్ వైరల్!

షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు, కవర్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్ లో ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో షణ్ముఖ్ జశ్వంత్ కూడా ఒకరు.సాధారణంగా స్టార్ హీరోల టీజర్లు, ట్రైలర్లకు కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తాయి.

 Bigg Boss Shanmukh Jashwanth Comments Goes Viral In Social Media, Big Boss Show,-TeluguStop.com

అయితే షణ్ముఖ్ జశ్వంత్ స్టార్ హీరో కాకపోయినా ఇతని వీడియోలు కూడా యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

బిగ్ బాస్ సీజన్5 కంటెస్టెంట్లలో ఒకరైన షణ్ముఖ్ జశ్వంత్ ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు.

షణ్ముఖ్ జశ్వంత్ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఎక్కువగా ఇష్టపడరనే సంగతి తెలిసిందే.ఒక ఇంటర్వ్యూలో తనకు ఇంటర్వ్యూలు ఇవ్వడం అస్సలు ఇష్టం ఉండదని షణ్ముఖ్ జశ్వంత్ చెప్పుకొచ్చారు. మామ్ హోమ్ టూర్ చేసిందని అలా చేయడం కూడా తనకు నచ్చలేదని షణ్ముఖ్ కామెంట్లు చేశారు.

తన వల్ల తన ఫ్యామిలీ మెంబర్స్ ను ఎవరైనా ట్రోల్ చేస్తే అస్సలు తట్టుకోలేనని షణ్ముఖ్ జశ్వంత్ అన్నారు.

షణ్ముఖ్ జశ్వంత్ చేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.తన వల్ల ఫ్యామిలీకి ఏమైనా ఇబ్బంది కలిగితే తట్టుకోలేనని షణ్ముఖ్ అన్నారు.ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షణ్ముఖ్ ఈ విషయాలను చెప్పుకొచ్చారు.ఇంటర్వ్యూలు ఇస్తే అనవసరమైన ప్రశ్నలను ఎక్కువగా అడుగుతారని షణ్ముఖ్ తెలిపారు.

యూట్యూబ్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న షణ్ముఖ్ జశ్వంత్ యూట్యూబ్ ఇంటర్వ్యూలకు దూరంగా ఉండటం గమనార్హం.తన కుటుంబ సభ్యుల గురించి తప్పుగా ఎవరు మాట్లాడినా భరించలేనని షణ్ముఖ్ వెల్లడించడం గమనార్హం.షణ్ముఖ్ త్వరలో సినిమాలతో బిజీ అవుతారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Bigg Boss Shanmukh Jashwanth Comments Goes Viral In Social Media

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube