దీప్తితో బ్రేకప్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన షణ్ముఖ్.. సిరి తప్పు లేదంటూ?

కొన్ని జోడీలకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.అలా ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న జోడీలలో దీప్తి సునైనా షణ్ముఖ్ జోడీ కూడా ఒకటని చెప్పవచ్చు.

 Shanmukh Jaswanth Comments About Deepti Sunaina Goes Viral , Fan Following ,sha-TeluguStop.com

షణ్ముఖ్ బిగ్ బాస్ షోకు ఎంపికైన సమయంలో దీప్తి సునైనా షణ్ముఖ్ కు కీలక సూచనలు చేశారని హౌస్ లో ఏ సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలో సలహాలు ఇచ్చారని జోరుగా ప్రచారం జరిగింది.

షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత అతనికి ఊహించని స్థాయిలో ఓట్లు రావడానికి ప్రతి వారం నామినేషన్ నుంచి సేవ్ కావడానికి దీప్తి సునైనా ఎంతగానో కష్టపడ్డారు.

అయితే బిగ్ బాస్ షో తర్వాత ఎవరూ ఊహించని విధంగా దీప్తి సునైనా షణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పడం గమనార్హం.పలు వెబ్ సిరీస్ ల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న షణ్ముఖ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీప్తితో బ్రేకప్ పై ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

చాలామంది తనకు, దీప్తి సునైనాకు మధ్య బ్రేకప్ కు సిరి కారణమని భావిస్తున్నారని అయితే అందులో నిజం లేదని షణ్ముఖ్ అన్నారు.ప్రేక్షకుల్లో స్పెషల్ గా గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచనతో తాను బిగ్ బాస్ షోకు వెళ్లానని ఇతరులతో తాను ఎక్కువగా మాట్లాడనని షణ్ముఖ్ వెల్లడించారు.

బిగ్ బాస్ షో ద్వారా తనపై ప్రేక్షకుల్లో పాజిటివిటీ ఏర్పడుతుందని అనుకున్నానని అయితే దానికి భిన్నంగా జరిగిందని షణ్ముఖ్ వెల్లడించారు.చిన్న వయస్సులోనే తనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయని షణ్ముఖ్ తెలిపారు.

సిరి మమ్మీ బిగ్ బాస్ హౌస్ లో చేసిన కామెంట్లు తనకు నచ్చలేదని షణ్ముఖ్ చెప్పుకొచ్చారు.తన వల్ల దీప్తి సునైనా నెగిటివిటీని ఎదుర్కోవడంతో పాటు ఫ్యామిలీ నుంచి ఆమెపై ఒత్తిడి పెరిగిందని షణ్ముఖ్ అన్నారు.ఇద్దరం హ్యాపీగా ఉండాలనే ఆలోచనతో బ్రేకప్ చెప్పుకున్నామని తాను, దీప్తి సునైనా మళ్లీ కలుస్తామో లేదో దేవుడి చేతుల్లోనే ఉందని షణ్ముఖ్ అన్నారు.బ్రేకప్ విషయంలో తననే నిందించాలని షణ్ముఖ్ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube