అమెరికాకు అగ్ర రాజ్య హోదా కట్టబెట్టడంలో వలస వాసుల పాత్ర అత్యంత కీలకం అందులోనూ భారతీయ వలస వాసుల పాత్ర ప్రధానమైనది .ఈ విషయం అందరికి తెలిసిందే.
అత్యంత నిపుణులైన భారతీయులు అమెరికాలో పనిచేస్తూ అమెరికాను ఆర్ధికంగా, టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళారు.అందుకె ఇప్పటికి అమెరికా పెద్దన్న హోదాలో నిలిచింది.
అయితే ఈ హోదాపై కన్నేసిన చైనా తమ దేశంలోకి నిపుణులకు పెద్ద పీట వేస్తోంది.దాంతో ఈ పరిస్థితిపై ఆందోళన చెందిన అమెరికా నూతన ఆవిష్కరణలు, వాటిని ఏర్పాటు చేసే వ్యవస్థాపకులను ఆకర్షించేందుకు కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది.
అమెరికా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ America Competes చట్టాన్ని ఆమోదించారు.చైనా దూకుడుకు కళ్ళెం వేసేందుకుగాను ఈ నూతన చట్టాన్ని ఆవిష్కరించినట్టుగా తెలుస్తోంది.
ఈ చట్టం ప్రకారం నూతన ఆవిష్కరణలు చేపట్టాలని భావించే వారికోసం ఇమ్మిగ్రేషన్ లో మార్పులు కూడా చేసుకోవచ్చునని తెలుస్తోంది.అంతేకాదు ఈ చట్టం వలన సులువుగా గ్రీన్ కార్డ్ కూడా పొందవచ్చునని అంటున్నారు నిపుణులు.
అమెరికాలో స్టార్టప్ కంపెనీలను బలోపేతం చేయడం ఈ చట్టం యొక్క ముఖ్యం ఉద్దేశ్యమని హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రకటించారు.ఇదిలాఉంటే.
ఈ చట్టాన్ని తీసుకురావడం ద్వారా భారతీయ నిపుణులకు భారీ ప్రయోజనం ఉంటుందని, అమెరికా రావాలని కోరుకునే భారతీయులకు ఈ చట్టం ద్వారా భారీ ప్రయోజనం కలుగుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.ఈ చట్టం ద్వారా ఇమ్మిగ్రేషన్ సవరణలో పలు మార్పులు కూడా చోటు చేసుకున్నాయి.
W అనే కేటగిరి వీసాలను ప్రవేశ పెట్టి దాన్ని w1 , w2 w3 అనే మూడు కెటిగిరీలుగా విభజిస్తారు.స్టార్టప్ ను ప్రారంభించే ఆసక్తి ఉన్న విదేశీయులకు W1 కేటగిరి, అలాగే స్టార్టప్ నిర్వహణ చేసే సిబ్బంది కోసం W2 వీసా, w1 ,W 2 వీసాలని కలిగి ఉన్న వారి జీవిత భాగస్వాములకు, పిల్లలకు W3 వీసాలని అందిస్తారు.