తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ - Telugu NRI America News

1.కొత్త గా ఈ పాస్ పోర్ట్

విదేశీ ప్రయాణాలు చేసే వారి కోసం కొత్తగా చిప్ తో కూడిన ఈ పాస్ పోర్ట్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర�-TeluguStop.com

2.అమెరికాలో పాక్ రాయబారి నియామకం నిలిపివేత

అమెరికాలో పాక్ రాయబారి నియామకాన్ని నిలిపివేశారు.ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు రావడం తో తమ దేశంలో పాక్ కొత్త రాయబారి మసూద్ ఖాన్ నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.

3.సారీ చెప్పిన బ్రిటన్ ప్రధాని

కోవిడ్ సమయంలో బ్రిటన్ ప్రధాని కార్యాలయం, ఇంట్లో జరిగిన పార్టీల వ్యవహారం పెద్ద దుమారం రేపిన నేపథ్యంలో .దీనిపై ప్రధాని బొరిక్ జాన్సన్ స్పందించారు.సారీ తప్పు జరిగింది సరిదిద్దుకుంటాను అంటూ వ్యాఖ్యానించారు.

4.హాకీ ఇండియా గోల్ కీపర్ కు పురస్కారం

టోక్యో ఒలంపిక్స్ లో సత్తా చాటిన హాకీ ఇండియా గోల్ కీపర్ శ్రీజేష్ కు ప్రతిష్టాత్మకమైన పురస్కారం దక్కింది.2021 కు సంబందించిన వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను ఆయన సొంతం చేసుకున్నాడు.

5.కెనడా ప్రధానికి కరోనా

కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడియా కోవిడ్ ప్రభావానికి గురయ్యారు.

6.భారత ప్రధానికి అంతర్జాతీయ గుర్తింపు

భారత ప్రధాని నరేంద్ర మోదీ కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతల్లో అత్యధిక సబ్ స్క్రైబర్లు ఉన్న ఛానెల్ గా మోదీ యూ ట్యూబ్ ఛానెల్ నిలిచింది.

7.మాస్క్ తీసినందుకు యూకే లో 2 లక్షల జరిమానా

యూకే కు చెందిన ఓ వ్యక్తి ఓ షాప్ లో మాస్క్ 16 సెకన్ల పాటు తీసివేయడం తో అతడికి 2 లక్షల  (భారత కరెన్సీ లో)  జరిమానా విధించారు.

8.భారత్ విషయంలో డబ్ల్యూహెచ్ వో పొరబాటు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యు.హెచ్ వో ) తన కోవిడ్ వెబ్ సైట్ లో భారత్ మ్యాప్ ను తప్పుగా చూపించడం పై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

9.కెనడా ప్రధాని పై కంగనా రనౌత్ ఆగ్రహం

కోవిడ్ నిబంధనలను వ్యతిరేకిస్తున్న ట్రక్ డ్రైవర్ ల నిరసనలకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన మద్దతు తెలిపింది.ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ,  కెనడా ప్రధాని ట్రుడో భారతీయ నిరసనకారులను ప్రోత్సహించాడు, ఇప్పుడు తన దేశంలో రహస్య ప్రదేశంలో దాక్కున్నాడు ఎందుకంటే నిరసనకారులు వారి భద్రత కు ముప్పు గా ఉన్నారు.ఎవరి కర్మకు వారే బాధ్యులు ‘ అంటూ కంగనా ట్వీట్ చేశారు.

Telugu NRI News Roundup, NRI News In Telugu, NRI News, Canada, Indians, US, Immigrants, Latest NRI News, Today NRI News , Indian Finance Minister Nirmala Sitharaman, Narendra Modi, Kangana Ranaut, Prime Minister Of Canada Trudeau - Telugu Canada, Indiannirmala, Indians, Kangana Ranaut, Latest Nri, Narendra Modi, Nri, Nri Telugu, Primecanada, Telugu Nri

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube