ఇస్మార్ట్ శంకర్.దర్శకుడు పూరీ తెరకెక్కించిన డబుల్ దిమాక్ మూవీ.
ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా చేశాడు.తెలంగాణ యాసలో తెరకెక్కిన ఈ సినిమా జనాల మదిలో మంచి ప్లేస్ సంపాదించింది.
మనం మాట్లాడుకునేటట్లుగా ఉండే డైలాగులు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి.నేరస్తుడు అయిన హీరో.
చివరకు అసలు నేరస్తులను పట్టుకోవడంలో ఎలా సహకరించాడు అనేది అసలు సినిమా.ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.
రామ్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమాలో రామ్ కు జోడీగా నభా నటేష్ నటించింది.
రామ్ తో ఈ సినిమాలో యాక్ట్ చేసింది.బోల్డ్ మాటలతో జనాలకు బాగా నచ్చేసింది.
ఇంతకీ ఈ అమ్మడు ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నభా నటేష్ కన్నడ అమ్మాయి.1995 డిసెంబర్ 11న జన్మించింది.శృంగేరిలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది.
ఉడిపి ఎన్ ఎం ఏ ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో డిగ్రీ పూర్తి చేసింది.అదే సమయంలో భరత నాట్యం నేర్చుకుంది.
స్కూల్ డేస్ నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం ఉండేది.అందుకే ఏ కార్యక్రమం జరిగినా అందులో పాల్గొనేది.
ఆ తర్వాత జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు ప్రకాష్ బెళగాడి దగ్గర యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంది.
అటు 2013లో బెంగుళూరులో జరిగిన ఫెమినా మిస్ ఇండియాలో నభా నటేష్ పాల్గొంది.ఇందులో తను టాప్ 11లో నిల్చింది.ఆ తర్వాత 2015లో కన్నడ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.
వజ్రకాయ అనే కన్నడ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఇందులో శివరాజ్ కుమార్ హీరోగా నటించాడు.
ఆ తర్వాత తెలుగులోకి నన్ను దోచుకుందువటే సినిమాతో అడుగు పెట్టింది.అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.