సీనియర్ ఎన్టీఆర్ కు 11 హిట్లు ఇచ్చిన ప్రముఖ డైరెక్టర్ ఎవరో మీకు తెలుసా?

అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో సక్సెస్ సాధించిన అతికొద్ది మందిలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు.నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించడం ద్వారా సీనియర్ ఎన్టీఆర్ పాపులారిటీని తెచ్చుకున్నారు.

 Interesting Facts About Senior Ntr Vitalacharya Combo Movies Details, Senior Ntr-TeluguStop.com

ఎన్నో పౌరాణిక పాత్రలు వేసి ఆ పాత్రల ద్వారా తెలుగువారి హృదయాలలో సీనియర్ ఎన్టీఆర్ నిలిచిపోయారు.పదుల సంఖ్యలో దర్శకుల డైరెక్షన్ లో సీనియర్ ఎన్టీఆర్ నటించారు.

అయితే ఎన్టీఆర్ ఎంతమంది దర్శకుల దర్శకత్వంలో నటించినా విఠలాచార్య ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎన్టీఆర్ కెరీర్ లో ప్రత్యేక సినిమాలుగా నిలిచాయి.ఈ కాంబినేషన్ లో సినిమాలపై ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపేవారు.

తక్కువ బడ్జెట్ లోనే క్వాలిటీ సినిమాలను తెరకెక్కించి విఠలాచార్య విజయాలను సొంతం చేసుకున్నారు.షూటింగ్ మొదలుపెట్టిన రోజునే విడుదల తేదీని ప్రకటించి ఆ తేదీనే విఠలాచార్య సినిమాలను విడుదల చేసేవారు.

విఠలాచార్య పలు సినిమాలకు నిర్మాతగా కూడా పని చేశారు.ఎన్టీఆర్, విఠలాచార్య కాంబినేషన్ లో మొత్తం 14 సినిమాలు తెరకెక్కాయి.

Telugu Aggipidugu, Alibaba Dongalu, Block Buster, Combo, Vithalacharya, Janapada

ఈ సినిమాలలో 11 సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా మూడు సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.విఠలాచార్య సినిమాల వల్ల ఎన్టీఆర్ కు వచ్చిన మాస్ ఇమేజ్ సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ కు ప్లస్ అయింది.వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బందిపోటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Telugu Aggipidugu, Alibaba Dongalu, Block Buster, Combo, Vithalacharya, Janapada

వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అగ్గిపిడుగు సినిమా ఆరోజుల్లో తొలివారం ఏకంగా 5 లక్షల రూపాయల కలెక్షన్లను సాధించింది.ఈ సినిమానే నాగ్ హీరోగా నటించిన హలో బ్రదర్ కు ప్రేరణ.అలీబాబా 40 దొంగలు, పిడుగు రాముడు మరికొన్ని సినిమాలు ఎన్టీఆర్, విఠలాచార్య కాంబినేషన్ లో తెరకెక్కడంతో పాటు విజయాలను అందుకున్నాయి.విఠలాచార్య తను తెరకెక్కించిన జానపద సినిమాల ద్వారా జానపద బ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు.1999 సంవత్సరంలో విఠలాచార్య కన్నుమూశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube