ఈ సృష్టిలో తల్లీబిడ్డల గొప్ప అనుబంధాన్ని మాటల్లో వర్ణించడం ఎవరి వల్లా కాదు.మనుషులైనా, జంతువులైనా సరే తల్లీబిడ్డల మధ్య అనుబంధం ఒకేలా ఉంటుంది.
తల్లికి బిడ్డ మీద ఉన్న ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.మనకు కనిపించే దేవత అమ్మ.
ఆ పిలుపులోనే ఎక్కడా లేని మాధుర్యం ఉంటుంది.నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి.
తన బిడ్డకి ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే.తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టడానికైనా సిద్ధమవుతుంది.
తల్లి కోసం బిడ్డ పడే ఆవేదన.అలాగే బిడ్డ కోసం తల్లి పడే తపన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
సరిగ్గా అలాంటి ఘటనే తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకుంది.తల్లీబిడ్డల అనుబంధానికి అద్దం పట్టే ఘటన ఇది.తల్లి బిడ్డల అనుబంధం అంటే కేవలం మనుషులకే కాదు మూగజీవాల మధ్య కూడా ఉంటుంది చెప్పడానికి ఈ గేదె ఓ ఉదాహరణ.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.పోరుర్లోని ప్రశాంత్ మోహన్ అనే వ్యక్తికి ఒక గేదె ఉంది.
అది మేత మేయడానికి ఊరు బయటకు వెళ్లిన సమయంలో ఒక దూడను ఈనింది.
ఈ విషయం తెలుసుకున్న యజమాని ఆ బుజ్జి దూడను తన ద్విచక్రవాహనం మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకుని వెళ్తున్నాడు.
అది గమనించిన గేదె అప్పుడే పుట్టిన తన బిడ్డను ఎక్కడికో తీసుకెళ్తున్నారని బాగా కంగారు పడిపోయింది.ఆ తల్లి గేదె ఆ ద్విచక్ర వాహనం వెంట బాధగా అరుస్తూ పరుగులు తీసింది.అలా తల్లి గేదె రోడ్డుపై వెళ్తున్న ఆ బండిని చాలా దూరం వెంబడించింది.రోడ్డుపై తన బిడ్డ కోసం పరుగులు పెడుతున్న దృశ్యాన్ని చూసిన స్థానికుల మనసు చలించిపోయింది.
ఈ తల్లీబిడ్డల ప్రేమానుబంధం చూసి ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనయ్యారు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఎమోషనల్ గా కామెంట్స్ పెడుతున్నారు.
ఈ హార్ట్ టచింగ్ వీడియో చూసి తల్లి ప్రేమకు మించింది ఈ సృష్టిలో ఏదీ లేదని నెటిజన్లు బాగా ఎమోషనల్ అవుతున్నారు.తల్లి ప్రేమను చాటే ఈ వీడియోపై మీరూ ఒక లుక్కేయండి.