తెలంగాణ రాజకీయాలు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.అయితే గత రెండు రోజులుగా విలేఖరుల సమావేశం నిర్వహిస్తూ బీజేపీకి తన ప్రశ్నలతో బీజేపీని ఇరుకున పెడుతున్న కేసీఆర్ పరోక్షంగా బీజేపీకి బంపర్ ఆఫర్ ఇచ్చారని బీజేపీలో అంతర్గత చర్చ జరుగుతోంది.
అయితే తెలంగాణలో ప్రస్తుతం చాలా వరకు నడుస్తున్న చర్చ బీజేపీ వైఖరిని ప్రజల్లోకి కేసీఆర్ బలంగా తీసుకెళ్లాడని.కాని బీజేపీ టార్గెట్ గా కేసీఆర్ ముందుకు రావడం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి అదనపు గుర్తింపునిచ్చే అంశం.
కాని ప్రస్తుతం బీజేపీ మాత్రం కేసీఆర్ మాటలకు సరైన సమాధానం ఇవ్వలేకపోయింది.కరెక్ట్ గా కేసీఆర్ విమర్శలకు సరైన కౌంటర్ ఇచ్చి ఉంటే బీజేపీ మరింతగా చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉండేది.
కాని ఈ సువర్ణావకాశాన్ని బీజేపీ జార విడుచుకున్నారనే చెప్పవచ్చు.
అయినా బీజేపీ నేతలు మాత్రం కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వేరే వేరే ప్రస్తావన తీసుకవస్తున్నారని ప్రజల్లోకి సంకేతాలు వెళ్తున్న పరిస్థితి ఉంది.
ఏది ఏమైనా నిన్న కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం బండి సంజయ్ ఇచ్చి ఉంటే బండి సంజయ్ విమర్శల పట్ల ఎంతో కొంత ప్రజల్లో నమ్మకం ఉండేది.
ఇప్పటి వరకు బండి సంజయ్ స్పందించకపోవడం కేసీఆర్ కు మరొక్క అస్త్రం ఇచ్చినట్టే అవుతుంది.అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించినా అసలు విషయంపై మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.ఒక వేళ స్పష్టమైన సమాధానం ఇచ్చి ఉంటే బీజేపీకి కొంత రాజకీయ లబ్ధి జరిగి ఉండేది.
మరి రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది.