మన ప్రపంచమే ఒక అద్భుతం.అలంటి ప్రపంచంలో కొన్ని మిస్టరీలు అందరికి ఛాలెంజెస్ విసురుతూ ఉంటాయి.
ఒకటా రెండా మన ప్రపంచమే ఒక మిస్టరీ లాంటిది.కొన్ని మిస్టరీలు ఎప్పటికి ఎన్ని ఏళ్లయినా పరిష్కారం కాకుండానే అలానే మిస్టరీగానే మిగిలి పోతాయి.
ఈ మిస్టరీలు మేధావులకు, మహానుభావులకు కూడా అంతు చిక్కకుండా ఉంటాయి.
కొన్ని సంఘటనలు విన్నప్పుడు అది నిజామా.
కాదా అనే సందేహం మనలో కలగడం మామూలే.ఇలాంటి అంతు చిక్కని విషయాలు విన్నప్పుడే మనలో వాటి గురించి తెలుసు కోవాలని మరింత ఉత్సాహం పెరుగుతుంది.
ప్రపంచంలో ఉన్న ఎన్నో మిస్టరీల్లో ఇది కూడా ఒకటి.అసలు ఈ మిస్టరీని మేధావులు కూడా ఛేదించలేక పోయారు.
దీనిని ఎంత ఛేదిద్దాం అని ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయిందట.
టెక్నికల్ గా ఎంత అభివృద్ధి చెందుతున్న కూడా ఇలాంటి మిస్టరీలను ఛేదించలేక పోతున్నారు.ఇప్పుడు మనం చెప్పుకోబోయే మిస్టరీ కూడా ఎవ్వరికి అంతు చిక్కనిది.సూసైడ్ బ్రిడ్జ్.
ఇది స్కాట్లాండ్ లోని ఓవర్ టైన్ లో ఉన్న బ్రిడ్జ్.అయితే ఈ బ్రిడ్జ్ దగ్గర సూసైడ్ చేసుకునేది మాత్రం మనుషులు కాదట.ఇక్కడ కుక్కలు సూసైడ్ చేసుకుని చనిపోతున్నాయట.
అందుకే ఈ బ్రిడ్జ్ దగ్గరకు కుక్కలను తీసుకు రావాలంటేనే వాటి యజమానులు బయపడి పోతున్నారట.అసలు విషయం ఏంటంటే.ఆ బ్రిడ్జ్ దగ్గరకు కుక్కలు వస్తే వెంటనే అవి ఆ బ్రిడ్జ్ మీద నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటున్నాయట.
అయితే అవి ఎందుకు అలా చేసుకుంటున్నాయో ఇంత వరకు ఎవ్వరికి తెలియదట.అందుకే ఇప్పటికే ఇది మిస్టరీగా మిగిలి పోయింది.
మిస్టరీ డాగ్ సూసైడ్ బ్రిడ్జ్ 50 అడుగుల ఎత్తులో ఉంది.కింద నీళ్లు ఉండక పోవడం వల్ల అవి దూకితే ప్రాణాలు కోల్పోతున్నాయట.ఇక్కడ గత 70 సంవత్సరాల వ్యవధిలో 600 కుక్కలు సూసైడ్ చేసుకుని మరణించాయట.అయితే ఇక్కడ ఆత్మలు తిరుగుతున్నాయని అందుకే ఆ కుక్కలు ఆత్మహత్య చేసుకునేలా ఏవ్ చేస్తున్నాయని చెబుతున్నారు.
కానీ వాటికీ ఎటువంటి ఆధారాలు లేవు.